VishwakSen : నేనేం భయపడను.. నాకు అలాంటి సినిమాలు చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు : విశ్వక్ సేన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VishwakSen : యంగ్ హీరో విశ్వక్ సేన్ హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. గతేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ సినిమాలతో అలరించారు. తాజాగా విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సారి విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించడంతో పాటు పూర్తి నిడివి కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతుంది. పైగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి హాజరైన కారణంగా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. లైలా సినిమాతో విశ్వక్ సేన్ కెరీర్ లో బెస్ట్ సక్సెస్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read Also:WPL 2025: నేటి నుండే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 షురూ.. మ్యాచ్‌లను ఎక్కడ చూడాలంటే!
Also Read
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
తాజాగా ఒక ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. లైలా సినిమా తన కెరీర్లో చాలా స్పెషల్ సినిమాగా నిలుస్తుందని అన్నారు. తన కెరీర్లో చేసిన ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ ఇదే అని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా విశ్వక్ సేన్ తన ఫ్యూచర్ మూవీస్ గురించి వెల్లడించాడు. మాస్ ఆడియన్స్‌ను అలరించే విధంగా యాక్షన్ ఎంటర్టైనర్లను చేసేందుకు తాను రెడీగా ఉన్నట్లు చెప్పాడు. కానీ హర్రర్ సినిమాలు చేసే ఉద్దేశం లేదన్నాడు. హర్రర్ సినిమాలు చేయాలనే ఆసక్తి తనకు లేదని, తనకు హర్రర్ సినిమాలు చూస్తుంటే తనకు భయం కలగదని అందుకే హర్రర్ సినిమాలు చేసే ఆలోచన లేదన్నారు.
Read Also:Donlad Trump: ‘‘బంగ్లాదేశ్‌ని మోడీకి వదిలేస్తున్నా’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
హర్రర్ సినిమాలు చూసి కొందరు చాలా భయపడ్డానని చెబుతుంటారు. ఆ సినిమాను నేను ఒక్కడినే వెళ్లి చూస్తాను. హర్రర్ సినిమాలు అంటే నాకు అస్సలు భయం లేదు. నేను భయాన్ని నటించలేను. అందుకు నేను హర్రర్ సినిమాలను ఇప్పుడే కాదు భవిష్యతులో కూడా చేయనని స్పష్టం చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లోనూ హర్రర్ కామెడీ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అందుకే విశ్వక్ సేన్ సైతం అలాంటి ఒక సినిమాను చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ విశ్వక్ సేన్‌కి మాత్రం ఆ ఆలోచన లేదని తేలిపోవడంతో కాస్త నిరాశకు లోనయ్యారు. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ సినిమా హర్రర్ కామెడీ అనే విషయం తెల్సిందే. ఆ ఒక్కటే కాకుండా రాబోయే రోజుల్లో చాలా తెలుగు సినిమాలు హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తాజావార్తలు
-
Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్‌కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
-
Naga Vamsi: ‘ఇది అంత కలర్‌ఫుల్ ఫీల్డ్ కాదు’.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
-
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!