Site icon NTV Telugu

Vishwak Sen: పొలిటీషియన్‌గా విశ్వక్‌సేన్.. ‘లెగసీ’ టీజర్ చూశారా!

Vishwak Sen

Vishwak Sen

Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరో నటిస్తున్న కొత్త సినిమా ‘లెగసీ’. రాజకీయ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను చూస్తే, ఇది ఒక ఇంటెన్స్ పాలిటికల్ డ్రామా అని స్పష్టంగా తెలుస్తుంది. ట్యాగ్‌లైన్ “పాలిటిక్స్ ఈజ్ పర్సనల్” ఈ సినిమా థీమ్‌ను బాగా ప్రతిబింబిస్తుంది. అధికారం, వారసత్వం, కుటుంబ బంధాలు, వాటి మధ్య జరిగే అంతర్గత యుద్ధాల ఆధారంగా ఈ తెరకెక్కినట్లు కనిపిస్తుంది. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఒక పొలిటీషియన్‌గా కనిపించనున్నారు.

READ ALSO: Grok AI Controversy: ఎక్స్ లో అసభ్యకరమైన ట్రెండ్ వైరల్.. మహిళల అభ్యంతరకరమైన చిత్రాలను సృష్టిస్తున్న గ్రోక్

‘రాజకీయమంటే పులిమీద సవారిలాంటిదంటారు. ఆ పులి మీద నాయకుడు ఒక్కడే కూర్చోవాలా? ఆ కుటుంబం మొత్తం కూర్చోవాలా?’, “దిస్ ఈజ్ యాన్ ఇంటర్నల్ వార్ ఫర్ రియల్ లెగసీ” అంటూ పలికిన డైలాగ్స్ టీజర్‌కు హైలెట్‌గా నిలిచాయి. సాయికిరణ్ రెడ్డి దైడా దర్శకత్వం వస్తున్న ఈ చిత్రాన్ని, యశ్వంత్ దగ్గుమటి, సాయికిరణ్ రెడ్డి దైడా నిర్మిస్తున్నారు. ఏక్తా రాథోడ్‌, రావు రమేశ్‌, సచిన్‌ ఖేడ్కర్‌, మురళీ మోహన్‌, కేకే మేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కలాహి మీడియా ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. సరికొత్త రాజకీయ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని మేకర్స్ తెలిపారు.

READ ALSO: Kishan Reddy: ఖైరతాబాద్ బస్తీల్లో పర్యటించిన కేంద్ర మంత్రి..

Exit mobile version