Viswak Sen : విశ్వక్ నామ సంవత్సరంగా 2025.. ఏకంగా నాలుగు సినిమాలు
- వరుసగా సినిమాలు చేస్తు్న్న విశ్వకసేన్
- త్వరలో రిలీజ్ కానున్న మెకానిక్ రాకీ
- 2025లో ఏకంగా 4సినిమాలతో బాక్సాఫీసు పై వార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viswak Sen : యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల కాలంలో వరుస విజయాలను దక్కించుకుని యూత్ ఐకాన్ గా మారిపోయాడు. ఇప్పటికే అతడి ఎనర్జీకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. హీరోగా విజయాలు ఖాతాలో పడటంతో అప్పటి వరకు ఉన్న క్రేజ్ రెట్టింపు అయింది. ‘గామీ’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ లాంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. త్వరలో ‘మెకానిక్ రాకీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత విశ్వక్ సేన్ ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని అంతా ఆలోచిస్తున్నాడు. 2025 రిలీజ్ ప్లానింగ్ లు ఏంటి? అన్న వివరాలను తానే స్వయంగా వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చా . కానీ వచ్చే ఏడాది నాలుగు సినిమాలతో వస్తాను. ‘లైలా’ షూటింగ్ 60 శాతం కంప్లీట్ అయింది. జనవరిలో అనుదీప్ దర్శకత్వంలో సినిమాతో పాటు, శ్రీధర్ గంటా-సుధాకర్ చెరుకూరిలతో కలిసి ఓ సినిమా మొదలు కాబోతుంది.
Read Also:Astrology: నవంబర్ 21, గురువారం దినఫలాలు
Also Read
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
మార్చిలో మరో సినిమా కూడా మొదలు పెడతా. ‘ఈ నగరానికి ఏమైంది-2′ కథకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే సాగర్ . కె. చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా ప్లానింగ్ లో ఉంది’ అని అన్నాడు. అలాగే కథల ఎంపికలో తన విధానాన్ని రివీల్ చేశాడు. సినిమాలు ఎవరు బాగా తీస్తారు అనే విషయం కంటే ఎవరు బాగా చేయలేరు అన్నది పసిగడతా. కొత్త దర్శకులా, సీనియర్ డైరెక్టర్లా ? అన్నది ఎప్పుడూ పట్టించుకోను. కానీ నన్ను ఎంచుకున్న దర్శకులకే నేను మొదటి ప్రాధాన్యతనిస్తా. ఎందుకంటే వాళ్లు మనలను చూజ్ చేసుకున్నారు. అంటే అన్ని రకాలుగా తాను రాసుకున్న కథకి నేను ఫిట్ అవుతున్నాను భావిస్తా. వాళ్లు నాపై నమ్మకంతో నా దగ్గరకు వస్తారు. కథ నచ్చి..అతడి పై నాకు నమ్మకం కలిగితే మరో విషయం ఆలోచించకుండా సినిమా చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు.
Read Also:Odisha: మరీ ఇంత దారుణమా? గిరిజన యువతిపై అసభ్య ప్రవర్తన.. మానవ మలాన్ని నోటిలో..
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!