విశాఖపట్నంలోని సాగరమాల ఆడిటోరియంలో బీజేపీ సోషల్ మీడియా వాలంటీర్ల సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురందేశ్వరి, ఆరు రాష్ట్రాల శంఖనాధ్ ఇన్ చార్జ్ దావల్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఎండగడుతుంటే కొంత మంది మొరుగుతున్నారు అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Uttarapradesh : ఘజియాబాద్‌లో ఇల్లు కూలి ముగ్గురు చిన్నారులు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు..
సీఎం వైఎస్ జగన్ 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న విషయం వైసీపీ నాయకులు గుర్తించాలి అని రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తెలిపారు. నార్త్ కొరియా నియంత కిమ్ కంటే జగన్మోహన్ రెడ్డి ప్రమాదకరంగా తయారయ్యాడు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్ట్ గురించి ప్రచారం జరుగుతోంది.. ఒక్కొక్కరినీ జైల్లో పెట్టేకంటే ప్రజలు అందరినీ జైల్లో పెడితే సరిపోతుంది కదా అని ఆయన అన్నారు. టీడీపీ, జనసేన పొత్తులు ఇప్పటికే ప్రకటించాయి.. బీజేపీ కలవడమా లేదా అనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది అని విష్ణుకుమార్ రాజు వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోంది అని రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకోవాలి అనేది పూర్తిగా బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుంది అని విష్ణుకుమార్ రాజు చెప్పుకొచ్చారు.
Read Also: Tata Motors: వెహికిల్ స్క్రాపింగ్ యూనిట్‌ని ప్రారంభం.. ఏడాదికి 15 వేల వాహనాలు తుక్కు తుక్కే