Site icon NTV Telugu

Vishnu Warrier : ఆ వార్తల్లో నిజం లేదు.. ఖమ్మం పోలీస్ కమిషనర్

Vishnu

Vishnu

మువ్వా విజయ్ బాబు ను హత్య చేస్తామంటూ.. పోస్టర్లు వెలిసినట్లు మీడియా, సామజిక మాద్యమాలలో వస్తున్న ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదన్నారు ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్. మువ్వా విజయ్ బాబు పై మీడియాలో వస్తున్న ఆరోపణలకు, వార్తలకు ఏలాంటి ప్రాధమిక అధారాలు పోలీసుల విచారణలో లభించలేదన్నారు. ఈ ఘటనపై ఏవరు కూడా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయలేదని విష్ణు వారియర్ తెలిపారు.

Bhatti Vikramarka : రేపటితో ముగియనున్న భట్టి పాదయాత్ర

ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సామజిక మాద్యమాలలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో ఎప్పుడు మువ్వా విజయ్ బాబు గారికి ప్రాణహాని వుందని అతను గాని వారి తరపున గానీ ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సందర్భాలు జిల్లాలో లేవు..ప్రస్తుతం పోలీస్ శాఖలో వున్న (Threat perception) ముప్పు జాబితాలో కూడా మువ్వా విజయ్ బాబు గారి పేరు లేదు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఊహాజనితమైన తప్పుడు కధనాలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పటిస్తూ ప్రశాంతంగా వున్న జిల్లాలో అలజడి సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలిస్ కమిషనర్ విష్ణు వారియర్ వెల్లడించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలేవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు కమిషనర్.

Ashwathama: ఆర్టీసీ డిపోలు మూతపడుతూ.. ప్రైవేట్ బస్సులు పెరుగుతున్నాయి..!

Exit mobile version