ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ కేంద్ర సర్వీసులోకి వెళ్లనున్నారు. ఐదేళ్లపాటు డిప్యూటేషన్‌పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఎస్పీగా విష్ణు వారియర్ సేవలందించనున్నారు. కాగా.. విష్ణు వారియర్‌ను స్టేట్ సర్వీస్ నుంచి వెంటనే రిలీవ్ చేయాలంటూ తెలంగాణ సీఎస్‌కు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాగా.. ప్రస్తుతం ఖమ్మం పోలీస్ కమిషనర్‌గా విష్ణు వారియర్ విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.