NTV Telugu Site icon

Vishal 34 : క్లైమాక్స్ షాట్ అప్డేట్ ఇచ్చిన విశాల్..

Whatsapp Image 2023 10 19 At 7.03.54 Pm

Whatsapp Image 2023 10 19 At 7.03.54 Pm

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తాజాగా నటించిన సినిమా మార్క్ ఆంటోనీ.. ఈ సినిమా థియేటర్ లోను అలాగే ఓటీటీ లో కూడా సూపర్ హిట్ అయింది.హీరో విశాల్ మార్క్ ఆంటోనీ సూపర్ సక్సెస్‌ను ఫుల్‌గా ఆస్వాదిస్తున్నాడు.ప్రస్తుతం విశాల్‌ తన 34 సినిమా తో బిజీగా ఉన్నాడు. మేకర్స్‌ ఇప్పటికే విశాల్‌ 34 అనౌన్స్ మెంట్‌ పోస్టర్‌ను షేర్ చేయగా.. చుట్టూ గన్స్‌, కత్తులు కనిపిస్తూ.. మధ్యలో స్టెతస్కోప్‌ ఉన్న లుక్‌ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ.. మూవీ లవర్స్‌లో సరికొత్త జోష్‌ నింపుతోంది విశాల్‌ టీం.తాజాగా చివరి షాట్‌.. వర్షం రూపంలో దేవుడి ఆశీస్సులు అందించాడు. హరి సార్‌ డైరెక్షన్‌లో కరైకుడిలో సుదీర్ఘమైన రెండో షెడ్యూల్‌ను పూర్తి చేయడం జరిగింది. టీజర్‌, ఫస్ట్ లుక్‌ త్వరలోనే.. అంటూ లొకేషన్‌లో తీసిన స్టిల్‌ను షేర్ చేశాడు విశాల్‌. మొత్తానికి ఒకేసారి షూటింగ్‌తోపాటు టీజర్‌ మరియు ఫస్ట్ లుక్ న్యూస్ షేర్ చేసి అభిమానులను ఎంతో ఖుషీ చేస్తున్నాడు విశాల్‌.

రీసెంట్‌గా తమిళనాడులోని తూతుకూడిలో విశాల్‌ 34 ఇంటెన్స్‌ క్లైమాక్స్‌ను షూట్ చేస్తున్నట్టు మేకర్స్ అప్‌డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. స్టంట్‌ మాస్టర్‌ కనల్ కన్నన్‌తో విశాల్‌ దిగిన స్టిల్‌ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఒకే ఫోటోలో ముగ్గురు మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్లతో నిలబడటం చాలా అరుదు ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.. అంటూ సెట్స్‌లో సముద్రఖని, గౌతమ్‌ మీనన్‌, హరితో దిగిన ఫొటోను షేర్ చేయగా సోషల్ మీడియాలో ఆ పిక్ వైరల్ అవుతోంది. అంతేకాదు మరో ప్రాజెక్ట్‌ తుప్పరివాలన్2 అప్‌డేట్‌ ను కూడా అందించాడు విశాల్.మాస్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న విశాల్‌ 34 చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నాడు. భరణి, పూజ సినిమాల తర్వాత హరి డైరెక్షన్‌లో విశాల్‌ నటిస్తోన్న మూడో సినిమా కావడం విశేషం. హరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. స్టోన్ బెంచ్‌ ఫిలిమ్స్‌-జీ స్టూడియోస్‌ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.