Vishal 34 : క్లైమాక్స్ షాట్ అప్డేట్ ఇచ్చిన విశాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తాజాగా నటించిన సినిమా మార్క్ ఆంటోనీ.. ఈ సినిమా థియేటర్ లోను అలాగే ఓటీటీ లో కూడా సూపర్ హిట్ అయింది.హీరో విశాల్ మార్క్ ఆంటోనీ సూపర్ సక్సెస్‌ను ఫుల్‌గా ఆస్వాదిస్తున్నాడు.ప్రస్తుతం విశాల్ తన 34 సినిమా తో బిజీగా ఉన్నాడు. మేకర్స్ ఇప్పటికే విశాల్ 34 అనౌన్స్ మెంట్ పోస్టర్‌ను షేర్ చేయగా.. చుట్టూ గన్స్, కత్తులు కనిపిస్తూ.. మధ్యలో స్టెతస్కోప్ ఉన్న లుక్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ.. మూవీ లవర్స్‌లో సరికొత్త జోష్ నింపుతోంది విశాల్ టీం.తాజాగా చివరి షాట్.. వర్షం రూపంలో దేవుడి ఆశీస్సులు అందించాడు. హరి సార్ డైరెక్షన్‌లో కరైకుడిలో సుదీర్ఘమైన రెండో షెడ్యూల్‌ను పూర్తి చేయడం జరిగింది. టీజర్, ఫస్ట్ లుక్ త్వరలోనే.. అంటూ లొకేషన్‌లో తీసిన స్టిల్‌ను షేర్ చేశాడు విశాల్. మొత్తానికి ఒకేసారి షూటింగ్‌తోపాటు టీజర్ మరియు ఫస్ట్ లుక్ న్యూస్ షేర్ చేసి అభిమానులను ఎంతో ఖుషీ చేస్తున్నాడు విశాల్.
రీసెంట్‌గా తమిళనాడులోని తూతుకూడిలో విశాల్ 34 ఇంటెన్స్ క్లైమాక్స్‌ను షూట్ చేస్తున్నట్టు మేకర్స్ అప్‌డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. స్టంట్ మాస్టర్ కనల్ కన్నన్‌తో విశాల్ దిగిన స్టిల్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఒకే ఫోటోలో ముగ్గురు మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్లతో నిలబడటం చాలా అరుదు ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.. అంటూ సెట్స్‌లో సముద్రఖని, గౌతమ్ మీనన్, హరితో దిగిన ఫొటోను షేర్ చేయగా సోషల్ మీడియాలో ఆ పిక్ వైరల్ అవుతోంది. అంతేకాదు మరో ప్రాజెక్ట్ తుప్పరివాలన్2 అప్‌డేట్ ను కూడా అందించాడు విశాల్.మాస్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న విశాల్ 34 చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నాడు. భరణి, పూజ సినిమాల తర్వాత హరి డైరెక్షన్‌లో విశాల్ నటిస్తోన్న మూడో సినిమా కావడం విశేషం. హరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్-జీ స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
తాజావార్తలు
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
-
Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!