Site icon NTV Telugu

Visakhapatnam: 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. విశాఖ కోర్టు సంచలన తీర్పు

Court

Court

Visakhapatnam: ఆడవాళ్లపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. చిన్నారుల జీవితాలను సైతం చిదిమేస్తున్నారు కామాంధులు.. అయితే, కొన్ని కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా దిశా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత.. ఈ కేసులను సీరియస్‌గా తీసుకుంటున్నారు పోలీసులు.. ఇక, 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో విశాఖ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చిన్నారిపై అఘాయిత్యం కేసులో.. నిందితుడు సూరిబాబుకి 20 ఏళ్ల జైలు శిక్ష , 10 వేల రూపాయలు జరిమానా విధించింది. అల్లూరి జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది అభంశుభం తెలియని 8 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు సూరిబాబు.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్‌ చేశారు.. ఇక, విచారణ జరిపిన విశాఖ ఫోక్సో కోర్టు.. నిందితుడిని దోషిగా తేల్చింది.. ఇక, ఏడాది గడవక ముందే కేసులో తీర్పు వెలువరించింది.. 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు విశాఖ ఫోక్సో కోర్టు న్యాయమూర్తి.. దీంతో.. న్యాయమూర్తి ఆనందికి ధన్యవాదలు తెలిపారు బాధిత కుటుంబ సభ్యులు.

Read Also: Bhadrachalam: భద్రాద్రి రాముడి అన్నదాన సత్రంలోకి వరద నీరు..

Exit mobile version