న్యూ ఇయర్ వేడుకలకు విశాఖ నగరం సిద్ధమవుతుంది. న్యూ ఇయర్ సందర్భంగా కొత్త జోష్ అందివ్వడానికి ఈవెంట్ ఆర్గనైజర్లు నెలరోజుల ముందు నుండే సిద్దమయ్యారు. నయా సాల్ సందర్బంగా మద్యం విక్రయాలు కోసం డిపోలకు క్యూలు కడుతున్నారు ఆర్గనైజర్లు. మరో వైపు గైడ్ లైన్స్ జారీ చేసింది ఎక్సైజ్ శాఖ. విదేశీ మద్యం, కల్తీ మద్యంపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఓపెన్ ప్లేస్‌లలో నిర్వహించే ఈవెంట్లకు ఎట్టి పరిస్థితుల్లో మద్యం విక్రయాలు నిర్వహించడానికి అనుమతులు ఉండవని స్పష్టం చేశారు.
Also Read: Mohanlal Mother Dead: మోహన్లాల్కి మాతృవియోగం!
రిటైల్ మద్యం స్టోర్లకు అర్ధరాత్రి 12 వరకు.. ప్లబ్బులు, క్లబ్బులకు అర్ధరాత్రి ఒంటిగంట వరకు అనుమతులు ఇస్తున్నామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. గత ఏడాది డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలలో సుమారు రూ.12 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరగ్గా.. ఈ ఏడాది రెట్టింపు అయ్యే అవకాశం ఉందన్నారు ఎక్సైజ్ సూపరండెంట్ ఆర్ ప్రసాద్. ఇప్పటివరకు 14 అప్లికేషన్లు న్యూ ఇయర్ ఇవెంట్స్ నిర్వహణ కోసం వచ్చాయన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ నెలలో రోజుకు సగటు రూ.5 నుంచి రూ.6 కోట్ల చొప్పున రూ.146 కోట్లు విక్రయాలు జరిగాయన్నారు. పోలీస్ శాఖ ఇచ్చిన గైడ్‌లైన్స్ ఎవరైనా మితిమీరిన, పాటించకపోయినా.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని ఎక్సైజ్ సూపరిండెంట్ ఆర్ ప్రసాద్ హెచ్చరించారు.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా లిక్కర్ సేల్స్ ఎన్టీఆర్ జిల్లాలో భారీగా జరుగుతున్నాయి. జిల్లాలో రెండు డిపోల నుంచి మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఒక్కో డిపో నుంచి రోజుకు సాధారణ రోజుల్లో మూడు కోట్ల వరకు అమ్మకాలు జరగ్గా.. గత నాలుగు రోజుల నుంచి నాలుగు నుంచి ఐదు కోట్ల మేర లిక్కర్ సేల్స్ జరుగుతున్నాయి. అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉండటంతో అమ్మకాలు జరుపుకున్నామని అధికారులు చెబుతున్నారు. రేపు కూడా భారీ ఎత్తున సేల్స్ జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. డిపో నుంచి భారీ ఎత్తున లిక్కర్ కేసులు వెళ్తుండటంతో స్థానికంగా సందడి నెలకొంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఊహించిన విధంగా మద్యం స్టాక్ ఆర్డర్లు పెరిగిపోయాయి. 246 మద్యం దుకాణాలు, 28 బార్లకు సైతం ఇండెంట్లు పెరిగాయి. డిసెంబర్ 29, 30వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా 18 కోట్ల విలువ చేసే లిక్కర్‌ను మద్యం గోడౌన్ నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న దుకాణాలకు తరలించారు. రేపు మరింత అమ్మకాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గత ఏడాదికి పోలిస్తే ఈ ఏడాది 5 శాతంకు పైగా అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఐఎంఎల్ గోడౌన్ నుంచి పెద్ద ఎత్తున మద్యాన్ని వాహనాల్లో నియోజవర్గాలకు తరలిస్తున్నారు.