NTV Telugu Site icon

FIFA World Cup2022 : ఖతార్‎ను కలవరపెడుతోన్న ‘కేమెల్ ఫ్లూ’.. ఆందోళనలో ఫుట్ బాల్ లవర్స్

Khatar

Khatar

FIFA World Cup2022 : ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న క్రీడ ఫుట్ బాల్.. ఖతర్‎లో ఫిఫా వరల్డ్ కప్ 2022 ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. మ్యాచ్ లను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అభిమానులు తరలివస్తున్నారు. విశ్వవ్యాప్తంగా 1.2మిలియన్ అభిమానులు ఖతర్ వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పరిశోధనా బృందం ఓ షాకింగ్ విషయం వెల్లడించింది. ఖతర్ లో ‘కేమెల్ ఫ్లూ’ వైరస్ వ్యాప్తి చెందే ముప్పు పొంచి ఉందని ప్రకటించింది.

Read Also: Manipal University : అలా అన్నందుకు స్టూడెంట్‎కు సారీ చెప్పిన ప్రొఫెసర్

‘కేమెల్ ఫ్లూ’ వైరస్ ను మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(మెర్స్) అని కూడా పిలుస్తారు. ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ వీక్షించేందుకు వచ్చిన వారిలో కేమెల్ ఫ్లూ వైరస్ లక్షణాలు బహిర్గతం అయినట్లు వెల్లడించారు. ఫిఫా వరల్డ్ కప్ డిసెంబరు 18వ తేదీ వరకు జరగనుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఖతార్ లో ప్రతి రోజు 300 వరకు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెర్స్ వైరస్ కూడా వెలుగు చూస్తే అదుపు చేయడం కష్టమని ఖతార్ ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Read Also: Fake Call : స్కూళ్లో బాంబ్ పెట్టాం.. ఏ క్షణంలోనైనా పేలొచ్చు

మెర్స్ ను తక్కువగా అంచనా వేయరాదని, మహమ్మారి స్థాయిలో వ్యాపించగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా హెచ్చరిస్తోంది. మెర్స్ వైరస్ ప్రధానంగా రోగగ్రస్తమైన ఒంటెల నుంచి మనుషులకు సోకుతుంది. మెర్స్ వైరస్ ఎక్కువగా మధ్య ప్రాచ్య దేశాల్లోనూ, దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లో ఉనికి చాటుకుంటోంది. 2012 నుంచి ఇప్పటిదాకా 27 దేశాల్లో ఈ వైరస్ వెలుగుచూసింది. ఈ వైరస్ సోకితే శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి. జ్వరం, దగ్గు, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. వృద్ధుల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారిలో, డయాబెటిస్ బాధితుల్లో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. క్యామెల్‌ ప్లూ వైరస్‌ ద్వారా సంక్రమించే మెర్స్‌ వ్యాధితో మరణాల రేటు 35 శాతం ఉందని హెచ్చరించారు.