NTV Telugu Site icon

Samyukta Menon : డైరెక్టర్‎కు పెద్ద గిఫ్ట్ ఇచ్చిన విరూపాక్ష హీరోయిన్

New Project (2)

New Project (2)

Samyukta Menon : సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన విరూపాక్ష సాలిడ్ కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. కార్తీక్ దండు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా థ్రిల్లింగ్ యాక్షన్ హర్రర్ జానర్ మూవీ. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే ఆడియన్స్, ఫ్యాన్స్ నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సాయి సంయుక్త జంట బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. చిత్రం భారీ హిట్ సాధించడంతో ప్రస్తుతం విరూపాక్ష టీం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది.

Read Also: Online Games: ఇక ఫోన్లో గేమ్స్ ఆడాలన్నా పన్ను కట్టాల్సిందే..?

ఇది ఇలా ఉంటే, ఆ సినిమా హీరోయిన్ సంయుక్త డైరెక్టర్ కార్తీక్ కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిందని ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే, ఇటీవల విరూపాక్ష మూవీ రిలీజ్ రోజు యూనిట్ తో కలిసి దర్శకుడు కార్తీక్ దండు హైదరాబాద్ లోని ఒక థియేటర్ కు వెళ్లారు. ఆ సమయంలో తన ఫోన్ పోగొట్టుకున్నారట. అయితే ఆ విషయం తెలుసుకున్న హీరోయిన్ సంయుక్త, వెంటనే ఆయనకు ఐఫోన్ ప్రో కొనిచ్చారట. ఈ విషయం తాజగా ఒక మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా ఆమె స్వయంగా వెల్లడించారు. దర్శకుడు కార్తీక్ తన ఫోన్ పోగొట్టుకోవడంతో ఇతరుల ఫోన్ లో సోషల్ మీడియా విషయాలు చూడడం గమనించానన్నారు. అందుకే, ఆయనకు ఐఫోన్ కొనిచ్చానని అన్నారు. అంతే కాకుండా తమ టీమ్ కి ఇంతటి భారీ విజయాన్ని అందించినందుకు సంయుక్త ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Read Also:Chennai: కారుపై నాటు బాంబులతో దాడి.. బిజెపి నేత దారుణ హత్య

Show comments