Virender Sehwag Reveals The Reason Why Virat Kohli Virat Kohli lifting Sachin Tendulkar in CWC 2011: తాము ముసలోళ్లం అయ్యాం అని, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను మోయడం తమ వల్ల కాదని అప్పటి యువకులతో చెప్పామని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. సచిన్‌ను ఎత్తుకుని స్టేడియంలో ఓ రౌండ్ తిప్పమని ఆదేశించామన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ముంబైలో జరిగిన మెగా టోర్నీ ఈవెంట్‌లో పాల్గొన్న సెహ్వాగ్.. 2011 ప్రపంచకప్ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.
28 ఏళ్ల తర్వాత 2011లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో శ్రీలంకపై అద్భుత విజయం సాధించి భారత అభిమానుల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించింది. 2011 ప్రపంచకప్‌లో విజయం అనంతరం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌ను భారత ఆటగాళ్లు భుజాలకెత్తుకుని మైదానమంతా తిరిగారు. అప్పటి జట్టులోని యువకుడు విరాట్ కోహ్లీ సచిన్‌ను తన భుజాలపై మోశాడు. దీనికి సంబంధించి వీరేంద్ర సెహ్వాగ్ ఓ ఆసక్తికర విషయం తాజాగా చెప్పాడు. బరువు ఎక్కువగా ఉంటాడు కాబట్టి.. అతడిని భుజాలకెత్తుకోవడానికి తిరస్కరించానని వీరూ వెల్లడించాడు.
Also Red: Sarvajit Laxman Century: హైదరాబాద్ నుంచి.. మరో క్రికెటర్ తనయుడు వచ్చేస్తున్నాడు!
తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ… ‘సచిన్ టెండూల్కర్ చాలా బరువు ఉంటాడు. మేం ముసలోళ్లం కాబట్టి అతడిని ఎత్తలేకపోయాము. మాలో కొందరికి భుజ గాయాలు ఉన్నాయి. ఎంఎస్ ధోనీకి మొకాలి గాయం ఉంది. మరికొందరు ఆటగాళ్లకు ఇతర ఫిట్‌నెస్ సమస్యలు ఉన్నాయి. అందుకే సచిన్‌ను మోసే బాధ్యతను యువ ఆటగాళ్లకు వదిలేశాం. సచిన్‌ను ఎత్తుకొని మైదానంలో ఓ రౌండ్ కొట్టమని యువకులకు చెప్పాం. అందుకే సచిన్‌ను విరాట్ కోహ్లీ తన భుజాలపై మోశాడు’ అని చెప్పాడు.
2011 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ నిలిచాడు. 9 మ్యాచ్‌ల్లో 53.55 సగటుతో 482 పరుగులు చేశాడు. వీరేందర్ సెహ్వాగ్ 8 మ్యాచ్‌ల్లో 380 పరుగులు చేశాడు. 2011 మెగా టోర్నీలో యువరాజ్ సింగ్ 9 మ్యాచ్‌లలో 8 ఇన్నింగ్స్‌ల్లో 362 పరుగులు బాదాడు. మరోవైపు బౌలింగ్‌లో 14 వికెట్లు పడగొట్టాడు. దాంతో యువీకి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. ఫైనల్లో గౌతమ్ గంభీర్, ఎంఎస్ ధోనీ కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.
Also Read: Amazon Prime Day Sale 2023: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023.. ఈ కార్డులపై 10 శాతం డిస్కౌంట్!