ఐపీఎల్‌లో బెస్ట్ కెప్టెన్ ఎవరు అనే అంశం ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ.. ఇప్పటికే తమతమ జట్లను లీగ్‌లో అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. టాప్ టీమ్స్‌గా గుర్తింపు తీసుకొచ్చారు. తాజాగా ఇదే విషయంపై మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ స్పందించారు. అప్‌కమింగ్ ఐపీఎల్-2023 సీజన్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో సహచర ఆటగాడు హర్భజన్‌తో కలిసి సెహ్వాగ్ మాట్లాడాడు. ఐపీఎల్‌లో అత్యుత్త సారథి ఎవరు అనే అంశంపై చర్చించాడు. ధోనీ కంటే రోహిత్ శర్మనే ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్ అని సెహ్వాగ్ చెప్పగా.. హర్భజన్ సింగ్ మాత్రం తన ఓటు ధోనీకేనని స్పష్టం చేశాడు.
Also Read: INDvsAUS 2nd Test: ఆదుకున్న అక్షర్, అశ్విన్.. టీమిండియా 262 ఆలౌట్
సెహ్వాగ్ మాట్లాడుతూ.. తన అభిప్రాయం ప్రకారం రోహిత్ శర్మనే అత్యుత్తమ ఐపీఎల్ కెప్టెన్ అన్నాడు. రోహిత్ ఎక్కువ ట్రోఫీలు గెలవడమే ఇందుకు కారణమని స్పష్టం చేశాడు. “గణంకాలే అన్నీ చెబుతాయి. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ధోనీ కెప్టెన్‌గా మారాడు. అయితే రోహిత్ శర్మ మాత్రం ముంబై ఇండియన్స్ జట్టుతోనే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ముంబై కెప్టెన్‌గా తన విజయ యాత్రను ప్రారంభించాడు. అందుకే అతను ఐపీఎల్ అత్యుత్తమ కెప్టెన్ అనేది నా అభిప్రాయం” అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
Also Read: Bihar: శభాష్ తల్లి.. బిడ్డ పుట్టిన కొన్ని గంటలకే పదోతరగతి పరీక్షకు హాజరు..
అయితే సెహ్వాగ్ వ్యాఖ్యలతో హర్భజన్ సింగ్ విభేదించాడు. ఐపీఎల్‌లో ఉత్తమ సారథిగా తన ఓటు ధోనీకేనని తెలిపాడు. “నా అభిప్రాయం ప్రకారం ఐపీఎల్ అత్యుత్తమ కెప్టెన్ ధోనీనే. ఎందుకంటే ఆరంభం నుంచి అతను ఒకే ఫ్రాంఛైజీకి ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ను విజయవంతమైన జట్టుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు. అతను జట్టును నడిపించిన తీరు కూడా అమోఘం. ఇతర కెప్టెన్లు కూడా బాగానే రాణిస్తున్నారు. టైటిళ్లు కూడా గెలుచుకుంటున్నారు. అయితే.. ఓవరాల్‌గా చూస్తే మాత్రం నా ఓటు కచ్చితంగా ధోనీకే”అని హర్భజన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో రోహిత్ ఐదు ట్రోఫీలు గెలవగా.. ధోనీ సారథ్యంలో చెన్నై నాలుగు ట్రోఫీలు కైవసం చేసుకుంది. ఇక తాను రెండు జట్లలో ఆడానని, 10 ఏళ్లు ముంబైకి ఆడటంతో అటు వైపే మనసు లాగుతున్నప్పటికీ.. చెన్నైతో రెండేళ్ల బంధంలో జట్టు నుంచి ఎంతో నేర్చుకున్నానని భజ్జీ తెలిపాడు.
Also Read: Phone In Toilet: టాయిలెట్లో ఫోన్ చూస్తే.. తప్పకుండా మీరక్కడికే