INDvsAUS 2nd Test: ఆదుకున్న అక్షర్, అశ్విన్.. టీమిండియా 262 ఆలౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 262 రన్స్‌కు ఆలౌటైంది. 139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్ పటేల్, రవి అశ్విన్ సెంచరీ భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రాహుల్ (17 లియోన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న రోహిత్ (32)తో పాటు వందో టెస్టు ఆడుతున్న పుజారా(0)ను ఒకే ఓవర్లో ఔట్ చేసిన లియోన్.. టీమిండియాను గట్టి దెబ్బ తీశాడు. ఇక కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్ (4) కూడా పెవిలియన్ చేరడంతో 66 రన్స్‌కే 4 కీలక వికెట్లు కోల్పోయిన ఇండియా కష్టాల్లో పడింది. ఆపై విరాట్ కోహ్లీ(44)తో కలిసి రవీంద్ర జడేజా (26) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఐదో వికెట్‌కు 59 రన్స్ పార్ట్‌నర్‌షిప్ నమోదు చేశాక జడేజాను మర్ఫీ ఔట్ చేశాడు. కాసేపటికే కోహ్లీ, భరత్ (6) ఔట్ అవడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆదుకున్న బాపు, అశ్విన్..
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
139 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయిన తరుణంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (115 బంతుల్లో 74) , రవి అశ్విన్ (71 బంతుల్లో 37) జట్టును ఆదుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. అశ్విన్ నెమ్మదిగా సపోర్ట్ ఇవ్వగా.. అక్షర్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోర్‌బోర్డును కదిలించాడు. ఏడో వికెట్‌కు 114 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశాక వరుస ఓవర్లలో అశ్విన్, అక్షర్ పెవిలియన్ చేరారు. అశ్విన్‌ను కమిన్స్ ఔట్ చేయగా.. అక్షర్‌ను మర్ఫీ బోల్తా కొట్టించాడు. అప్పటికే భారత్ స్కోరు 259. ఆసీస్ కంటే మరో 4 పరుగులు మాత్రమే వెనకబడి ఉంది. కాసేపటికే షమీ (2) కూడా వెనుదిరగడంతో 262 రన్స్ వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో ఆసీస్‌కు ఒక రన్ లీడ్ లభించింది. కంగారూ బౌలర్లలో లియోన్ 5 వికెట్లతో సత్తాచాటగా.. మర్ఫీ, కునేమన్ చెరో రెండు వికెట్లు, కమిన్స్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
Also Read: Naseem Shah: PSL మ్యాచ్‌కు BPL హెల్మెట్.. పాక్ క్రికెటర్‌కు జరిమానా
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!