Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Watch Price: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలవడంతో జట్టు సంబరాలు మిన్నంటాయి. ట్రోఫీని గెలుచుకున్న ఆనందంలో విరాట్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పటీదార్, కృనాల్ పాండ్యా తదితర ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తూ సందడి చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వేడుకల్లో కోహ్లీ డ్యాన్స్‌తో పాటు ఆయన చేతికి ఉన్న ఖరీదైన వాచ్ కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది.
వైరల్ వీడియోల్లో ట్రోఫీతో కలిసి సంబరాలు జరుపుకుంటున్న కోహ్లీ చేతికి ఉన్న వాచ్ ను గమనించిన అభిమానులు వెంటనే దాని వివరాలు వెతకడం ప్రారంభించారు. చివరగా ఆ వాచ్ ప్రముఖ లగ్జరీ వాచ్ బ్రాండ్ Patek Philippe Aquanaut Travel Time 5164G అని గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన, అరుదైన వాచ్‌లలో ఇది ఒకటిగా పేరుగాంచింది. తెల్ల బంగారంతో (White Gold) తయారు చేసిన ఈ వాచ్‌లో బ్లూ-గ్రే రంగు డయల్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఆక్వానాట్ సిరీస్‌కు ప్రత్యేకమైన ఎంబాస్డ్ డిజైన్‌తో రూపొందించిన డయల్ వాచ్‌కు మరింత ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. స్పోర్టీ డిజైన్‌తో పాటు అత్యాధునిక సాంకేతికతను కలగలిపిన ఈ వాచ్ ప్రపంచవ్యాప్తంగా వాచ్ ప్రేమికులను ఆకర్షిస్తుంది.
Also Read
- Supreme Court: వైసీపీకి బిగ్ రిలీఫ్.. నామినేషన్ల అడ్డంకులపై సుప్రీం సీరియస్.. కీలక ఆదేశాలు
- AP Municipal Elections: విజయవాడ టీడీపీలో టికెట్ చిచ్చు.. బుద్ధా వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్తత
- Trump: గత ఒప్పందాల కంటే భిన్నంగా ఉంటుంది.. భారత్-అమెరికా వాణిజ్యంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Madakasira: మడకశిర జనసేన అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామం... నామినేషన్ తిరస్కరణతో మారిన సీన్..
ఈ వాచ్‌లో ఉన్న డ్యూయల్ టైమ్ జోన్ ఫీచర్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఒకేసారి రెండు వేర్వేరు దేశాల సమయాలను చూపించే సామర్థ్యం దీనికి ఉంది. అలాగే పగలు, రాత్రి సూచికలు కూడా ఉండటంతో తరచూ విదేశీ పర్యటనలు చేసే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 40.8mm వైట్ గోల్డ్ కేసింగ్‌తో రూపొందించిన ఈ వాచ్‌కు బ్లూ-గ్రే కంపోజిట్ స్ట్రాప్‌ను అమర్చారు. సఫైర్ క్రిస్టల్ కేస్ బ్యాక్ ద్వారా వాచ్ లోని మెకానికల్ మూవ్‌మెంట్‌ను కూడా చూడవచ్చు. అలాగే ఆక్వానాట్ ఫోల్డింగ్ క్లాస్ప్ సౌకర్యం, భద్రతను అందిస్తుంది.
ఈ లగ్జరీ వాచ్ ధర కూడా అంతే భారీగా ఉంది. Patek Philippe Aquanaut Travel Time 5164G వాచ్ విలువ సుమారు రూ.1.6 కోట్లు ఉంటుంది. ఇటీవల భారత క్రికెటర్ల చేతుల్లో కనిపించిన అత్యంత ఖరీదైన వాచ్‌లలో ఇది ఒకటి. ఈ వాచ్ ధరను తెలుసుకున్న అభిమానులు భిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కింగ్ అంటే ఆ మాత్రం ఉంటుందని కొందరంటుంటే.. మరికొందరమె ఆ డబ్బులతో ఓ కుటుంబం మొత్తం లైఫ్ టైం సెటిల్ అవ్వచ్చు కదయ్యా అని కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Poco X8s: పోకో X8s లాంచ్.. 6,330mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కొత్త ఫోన్!
-
Supreme Court: వైసీపీకి బిగ్ రిలీఫ్.. నామినేషన్ల అడ్డంకులపై సుప్రీం సీరియస్.. కీలక ఆదేశాలు
-
AP Municipal Elections: విజయవాడ టీడీపీలో టికెట్ చిచ్చు.. బుద్ధా వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్తత
-
SBI Cyber Attack: ఎస్బీఐ ఖాతాదారుల డేటా డార్క్ వెబ్‌లో లీక్.. 3,897 మందిపై ప్రభావం!
-
Trump: గత ఒప్పందాల కంటే భిన్నంగా ఉంటుంది.. భారత్-అమెరికా వాణిజ్యంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!