ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ విరాట్ కోహ్లీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 2025లో భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ టూర్ విరాట్ కోహ్లికి చివరిదని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది జూన్ 20 నుంచి జులై 31 మధ్య ఇంగ్లండ్‌తో భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ సమయంలో కోహ్లీకి 36 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలో.. 2025 టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ గడ్డపై విరాట్ కోహ్లీ చివరి టెస్ట్ సిరీస్ కావచ్చని బ్రాడ్ తెలిపాడు. కోహ్లీ 2014, 2018, 2021-22లో మూడుసార్లు ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్‌లు ఆడాడు.
Read Also: Hamas: హమాస్ గాజా చీఫ్ ఖతం.. ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో మృతి..
టెస్ట్ క్రికెట్‌లో కోహ్లీ రికార్డులు చాలా ఉన్నాయి. కానీ.. ఇంగ్లాండ్‌లో అంత రాణించలేకపోయాడు. ఇంగ్లండ్‌లో అతని సగటు 33.21 ఉంది. స్టువర్ట్ బ్రాడ్ మాట్లాడుతూ, “ఇది విరాట్ చివరి ఇంగ్లాండ్ పర్యటన కావచ్చు. అతనికి చాలా ప్రతిభ, అనుభవం ఉంది. కోహ్లీ ఫ్రంట్-ఫుట్ స్టైల్ ఆడతాడు. ఇంగ్లాండ్ జట్టుకు తక్కువ అనుభవం ఉంది.” అని బ్రాడ్ చెప్పాడు. కాగా.. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Also: UPS: యూపీఎస్ అమలుకు కేంద్రం యుద్ధప్రాతిపదికన సన్నాహాలు ఈ నెలలోనే..