NTV Telugu Site icon

IPL 2024: ధోనీతో కలిసి ఆడటం ఇదే చివరి మ్యాచ్..! కోహ్లీ కీలక వ్యాఖ్యలు

Kohli

Kohli

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఈ ఐపీఎల్ చివరిదని అందరూ అనుకుంటున్నారు. ఈ సీజన్లో మంచిగానే రాణిస్తున్నప్పటికీ అతని కెప్టెన్సీ బాధ్యతలు కూడా రుతురాజ్ గైక్వాడ్కు అప్పజెప్పాడు. దీంతో.. క్రికెట్ అభిమానులతో పాటు, పలువురు ఆటగాళ్లు కూడా ఈ సీజన్ ధోనీకి చివరిదని చెబుతున్నారు. అందుకోసమని.. ధోనీని చూసేందుకు అభిమానులు సీఎస్కే మ్యాచ్ ఎక్కడ జరిగినా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక.. ధోనీ క్రీజులో దిగాడంటే అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోతుంది.

Read Also: Kangana Ranaut: బాబోయ్.. రాజకీయాలకంటే సినిమాలు చాలా ఈజీ.. హీరోయిన్ కామెంట్స్..

ఇదిలా ఉంటే.. ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే అనుమానాలొచ్చేలా కింగ్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనీతో ఈరోజు మ్యాచ్ ఆడుతున్నానని.. నాకు తెలిసి మేం కలిసి ఆడటం ఇదే చివరిదేమో అని కోహ్లీ తెలిపారు. వచ్చే సీజన్ లో ధోనీ ఆడుతాడో, ఆడడో.. ఎవరికి తెలుసని పేర్కొన్నారు. అయితే.. ఈ మ్యాచ్ ఫ్యాన్స్ కు పండగేనని, అద్భుతమైన అనుభూతి ఇస్తుందని చెప్పారు. మేమిద్దరం కలిసి భారత్ తరఫున చాలా సంవత్సరాలు ఆడామని.. జట్టును ఎన్నోసార్లు గెలిపించామని విరాట్ కోహ్లీ అన్నారు.

Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య

కాగా.. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ఈరోజు కీలక పోరు జరగనుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ప్లేఆఫ్స్‌లో మిగిలిన ఏకైక బెర్తును సొంతం చేసుకోవాలంటే ఈ రెండు జట్లకు గెలుపు తప్పనిసరి. దాంతో ఈ మ్యాచ్‌పైనే క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Show comments