Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్‌పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: ఐపీఎల్ 2026 చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్ క్వాలిఫయర్స్ ఎవరో తేలిపోయింది. ముంబై ఇండియన్స్ పై విజయం సాధించిన రాజస్థాన్ జట్టు నాల్గవ క్వాలిఫయర్ గా చేరింది. దీనితో ఇప్పుడు అందిరి చూపు క్వాలిఫయర్-1 మ్యాచ్ పై పడింది. అయితే ఇది ఇలా ఉండగా క్వాలిఫయర్-1 మ్యాచ్ ముందు విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధర్మశాలలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య కీలక పోరుకు ముందు ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా కోహ్లీ, గిల్ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సరదా చర్చ సాగింది. ఈ సమయంలో గిల్ కొత్త గడ్డం లుక్ ను చూసిన కోహ్లీ సరదాగా ఆటపట్టించడం వీడియోలో కనిపించింది. కోహ్లీ వ్యాఖ్యలకు గిల్ కూడా నవ్వుతూ స్పందించడంతో అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం గిల్ హెవీ బీర్డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. సాధారణంగా క్లీన్ షేవ్ లేదా తక్కువ గడ్డంతో కనిపించే గిల్, ఈసారి పూర్తిగా కొత్త స్టైల్లో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ లుక్ తనకు “లక్ చార్మ్”గా మారిందని గిల్ ఇప్పటికే సరదాగా చెప్పాడు. గిల్‌కు ఈ సీజన్ అద్భుతంగా సాగుతోంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ముందుండి జట్టును నడిపిస్తున్న అతడు, టాప్ ఆర్డర్లో భారీ పరుగులు చేస్తూ జట్టును ప్లేఆఫ్స్‌లో టాప్-2 స్థానం వరకు తీసుకెళ్లాడు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
ఇకపోతే భారత జట్టులో కలిసి ఆడిన కోహ్లీ, గిల్ మధ్య మంచి అనుబంధం ఉంది. యువ ఆటగాడిగా గిల్ ఎదుగుదలలో కోహ్లీ ప్రోత్సాహం ఎంతో ఉందని పలుమార్లు చర్చ జరిగింది. కోహ్లీ ఆగ్రెసివ్ ఆటతీరు, ఫిట్నెస్, పెద్ద మ్యాచ్‌లలో ఒత్తిడిని ఎదుర్కొనే విధానం నుంచి చాలా నేర్చుకున్నానని గిల్ కూడా గతంలో చెప్పాడు. ఇక ఈ వీడియో బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియాలో భారీగా షేర్ చేస్తున్నారు. “సీనియర్-జూనియర్ మోమెంట్”, “కోహ్లీ-గిల్ బాండింగ్ సూపర్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సరదా ఘటనతో క్వాలిఫయర్-1పై మరింత ఆసక్తి పెరిగింది. కోహ్లీ ఆర్సీబీ, గిల్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే ఈ పోరులో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2026 ఫైనల్‌కు అర్హత సాధించనుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో తలపడనుంది.
🚨 Virat Kohli teasing Shubman Gill for his beard in the Dharamshala today. 😂❤️ pic.twitter.com/zpCOWksuRZ
— Ahmed Says (@AhmedGT_) May 24, 2026
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!