NTV Telugu Site icon

Virat Kohli : కూతురితో కలిసి స్విమ్మింగ్ చేసిన విరాట్ కోహ్లీ

Virat Kohli

Virat Kohli

బిజీబిజీగా గడిపే టీమిండియా స్టార్, ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన గారాలపట్టి వామికాకు సమయం కేటాయించాడు. స్విమ్మింగ్ పూల్ లో తన చిన్నారి కూతురితో కలిసి సేద తీరుతున్న ఫోటోను కోహ్లీ మంగళవారం సోషల్ మీడియాతో కలిసి పంచుకున్నాడు. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఫోటో క్షణాల్లోనే వైరల్ గా మారింది. కాగా ఐపీఎల్-2023లో బెంగళూరు వేదికగా ఆర్సీబీ-లక్నో మధ్య మ్యాచ్ జరిగింది.

Read Also : BJP election campaign song: “నాటు నాటు” సాంగ్ “మోడీ మోడీ”గా మారింది.. కర్ణాటకలో వైరల్ అవుతున్న వీడియో..

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. అయితే హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో చివరికి బై రూపంలో రన్ రావడంతో లక్నో సూపర్ జెయింట్ విజయం సాధించింది. దీంతో డుప్లెసిస్ టీమ్ కి రాహుల్ సేన చేతిలో ఓటమి తప్ప లేదు. ఇక ఈ మ్యాచ్ లో 44 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ.

Read Also : ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్‌ వేదికలకు కొత్త హంగులు.. హైదరాబాద్‌ స్టేడియానికి రూ. 117 కోట్లు

ఇదిలా ఉండగా.. సోమవారం జరిగిన మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ తనకు దొరికిన కొంచం సమయంలో తన కూతురు వామికాతో గడిపాడు. కాగా 2017లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుష్క శర్మను కోహ్లీ వివాహం చేసుకున్నాడు. వారికి 2021 జనవరి లో కూతురు వామిక పుట్టింది. అయితే విరుష్క జంట మాత్రం ఇంతవరకు వామిక ఎలా ఉంటుందో కూడా అభిమానులకు చూపించలేదు. తమ కూతురిని సెలబ్రిటీ ఇమేజ్ కు ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని భావిస్తున్నట్లు ఇప్పటికే కోహ్లీ-అనుష్క శర్మ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తన పూర్తి రూపాన్ని చూపించనప్పటికీ ఆమెతో గడిపిన అద్భుత క్షణాలను ఇలా కెమెరాలలో బంధిస్తూ అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటారు.

Ipl Ad