టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 4 వేల రన్స్ పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 3990 పరుగులు చేశారు. ఇప్పటి వరకు మొత్తంగా 545 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన కోహ్లీ 27 వేలకు పైగా పరగులు సాధించారు.
Read Also: TG Govt: రైతులకు సర్కార్ శుభవార్త.. వారికి రైతు భరోసా నిధులు
మ్యాచ్ విషయానికొస్తే.. 55 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. 19వ ఓవర్లో ఆఫ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ సాల్ట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఓపెనర్ రోహిత్ శర్మ (1) మరోసారి ఫేలయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (78), శ్రేయస్ అయ్యర్ (7) ఉన్నారు.
Read Also: 1984 anti-Sikh riots: 1984 సిక్కుల ఊచకోత కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ..