NTV Telugu Site icon

Virat Kohli-Rohit Sharma: ఫొటో దిగుదామని రోహిత్‌ను నేనే కోరా: కోహ్లీ

Virat Kohli Rohit Sharma

Virat Kohli Rohit Sharma

Virat Kohli Says Winning T20 World Cup is very special for Me: టీ20 ప్రపంచకప్‌ 2924 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్‌ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దాంతో 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. భారత్‌ రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ను అందుకోవడంతో ఆటగాళ్లతో ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫైనల్‌లో విజయం అనంతరం టీమిండియా ఆటగాళ్ల సంబరాలు మిన్నంటాయి. కొంతమంది ప్లేయర్స్ భావోద్వేగానికి గురయ్యారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ అయితే చాలా ఎమోషనల్‌ అయ్యారు. కాసేపటికి రోహిత్, కోహ్లీలు జాతీయజెండాను తమ భుజాలపై కప్పుకుని.. టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీతో ఫొటోలు దిగారు.

రోహిత్‌ శర్మతో ఐకానిక్‌ ఫొటో దిగడానికి గల కారణాన్ని విరాట్ కోహ్లీ తాజాగా తెలిపాడు. ప్రపంచకప్‌తో ఇద్దరం కలిసి ఫొటో దిగుదామని రోహిత్‌ను తానే కోరినట్లు విరాట్ చెప్పాడు. ‘టీ20 ప్రపంచకప్‌ గెలవడం నాకే కాదు.. రోహిత్‌ శర్మకు కూడా చాలా ప్రత్యేకం. రోహిత్‌ ఫ్యామిలీ మైదానంలోనే ఉంది. సమైరాను భుజాలపై ఎత్తుకుని సంతోషపడ్డాడు. ఈ విజయం వెనక రోహిత్ కృషి ఎంతో ఉంది. కాసేపు ట్రోఫీని పట్టుకోమని రోహిత్‌కి చెప్పా. మా ఇద్దరి ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. అందుకే ఇద్దరం కలిసి ఫొటో దిగాం’ అని విరాట్ కోహ్లీ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ చెప్పాడు.

Also Read: Gold Rate Today: పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులో ఉండి ప్రపంచకప్ సాధించడం ఇదే మొదటిసారి. 2007 టీ20 ప్రపంచకప్‌ సాధించిన భారత జట్టులో రోహిత్ సభ్యుడిగా ఉన్నాడు. అప్పటికి కోహ్లీ టీ20ల్లో అరంగేట్రం చేయలేదు. ఇక 2011 వన్డే ప్రపంచకప్‌ సాధించిన జట్టులో కోహ్లీ ఉన్నాడు. అప్పుడు రోహిత్‌కు భారత జట్టులో చోటు దక్కలేదు. 2011 అనంతరం జరిగిన వన్డే, టీ20 ప్రపంచకప్‌లలో ఇద్దరు కలిసి ఆడినా.. టీమిండియా కప్ సాధించలేదు.