వెస్టిండీస్, యూస్ఏలలో జరగబోయే ICC టీ20 ప్రపంచ కప్ లో భారత సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఓపెనింగ్ చేయాలని భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కోరాడు. ఈ పిచ్ ల్లో మొదటి ఆరు ఓవర్లలో ఎక్కువ పరుగులు చేసే అవకాశాలు ఉంటాయని.. కాబట్టి వీరి జోడి మంచిగా పరుగులు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పాడు. చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. 2023 వన్డే ప్రపంచకప్‌లో చూసినట్లుగా పవర్‌ప్లే ఓవర్లలో కోహ్లీ మరింత స్వేచ్ఛగా స్కోర్ చేస్తాడని చెప్పాడు. ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీకి ఆటతీరు అద్భుతంగా ఉందని చెప్పాడు. అతను ఆ టెంప్లేట్‌ను అనుసరించినప్పుడు చాలా పరుగులు చేశాడని తెలిపాడు. టీ20ల్లో కూడా తొలి బంతికే ఫోర్లు, సిక్సర్లు బాదడం చాలా అరుదు. కోహ్లీ కొంత సమయాన్ని తీసుకుంటాడని.. పవర్‌ప్లేలో గొప్ప స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేయగలడని తెలిపాడు. టీమ్ మేనేజ్‌మెంట్ ఓపెనర్లుగా తమతో ముందుకు వెళ్లాలనుకుంటే.. వారు ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌తో ప్రారంభించాలని చోప్రా అన్నాడు.
Suicide: తండ్రి ఫోన్ వాడొద్దన్నందుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న కూతురు..
2023 వన్డే ప్రపంచ కప్‌లో కోహ్లీ అత్యధిక రన్ స్కోరర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అయితే.. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో ఓడిపోయిన తర్వాత టీమిండియా తరపున తన మొదటి వైట్-బాల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. స్వదేశంలో జరిగే మూడు టీ20ల సిరీస్‌లో.. ఆఫ్ఘనిస్థాన్‌తో రెండో టీ20లో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్‌కు దూరమైన కోహ్లీ.. ఇండోర్ మ్యాచ్ లో ఆడనున్నాడు.