Kohli-Rohit: కోహ్లీ, రోహిత్‌కు కష్టమేనా?.. హిట్‌మ్యాన్ కల అంతేనా ఇక?
- టీ20, టెస్ట్ ఫార్మాట్లకు కోహ్లీ, రోహిత్ వీడ్కోలు
- వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న కోహ్లీ, రోహిత్
- హిట్‌మ్యాన్ కల అంతేనా ఇక?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli & Rohit Sharma’s ODI future and the 2027 World Cup టీమిండియా సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్‌తో సిరీస్ వాయిదా పడడంతో ఇద్దరు మైదానంలోకి దిగడానికి మరిన్ని రోజుల సమయం పట్టనుంది. ఆస్ట్రేలియాపై మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ, రోహిత్‌లు ఆడనున్నారు. అయితే ఇంగ్లండ్‌పై కుర్రాళ్లు ఇంగ్లండ్‌పై అద్భుత ప్రదర్శన చేయడం ఈ సీనియర్ ఆటగాళ్లు వన్డే ఫార్మాట్లో కొనసాగడంపై ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఆస్ట్రేలియా సిరీస్ అనంతరం దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఉంటుంది. 2026 జనవరి, జులై మధ్య న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో ఆరు వన్డేలు ఆడే అవకాశముంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మరో ఏడాదిలో మొత్తంగా 12 వన్డేలు ఆడనున్నారు. 2027 నవంబరులో వన్డే ప్రపంచకప్ జరగనుంది. మెగా టోర్నీకి సంసిద్ధం కావడానికి ఈ సీనియర్లకు ఈ మ్యాచ్‌లు సరిపోతాయా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది. కేవలం వన్డేలు, ఐపీఎల్‌తో వన్డే ప్రపంచకప్ వరకు ఆటలో ఎలా కొనసాగుతారో అని మరో ప్రశ్న. ఈ నేపథ్యంలోనే కోహ్లీ, రోహిత్‌కు మెగా టోర్నీలో ఆడడం కష్టమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Also Read: Horoscope Today: బుధవారం దినఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
‘2027 వన్డే ప్రపంచకప్‌నకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అప్పటికి రోహిత్‌కు 40, కోహ్లీకి 38 దాటుతాయి. మెగా టోర్నీకి స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. భారత్ చివరిసారి 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచింది. ప్రపంచకప్‌లో కుర్రాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. కోహ్లీ, రోహిత్‌లను రిటైర్మెంట్ అంటూ ఒత్తిడి చేస్తారని నేను అనుకోవట్లేదు. అయితే మానసికంగా, శారీరకంగా ఇద్దరి పరిస్థితేంటో తెలుసుకోవడం ముఖ్యం. ఇందుకోసం వాళ్లతో ప్రొఫెషనల్‌గా సంభాషణ ఉంటుంది. వారి నిర్ణయంపై అంతా ఆధారపడి ఉంటుంది’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. వన్డే ప్రపంచకప్ గెలవడం రోహిత్ కల అన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల దృష్ట్యా హిట్‌మ్యాన్ కల నెరవేరుతుందా లేదో చూడాలి. 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కోహ్లీ సభ్యుడు అన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..