Site icon NTV Telugu

Kohli-Rohit: కోహ్లీ, రోహిత్‌కు కష్టమేనా?.. హిట్‌మ్యాన్ కల అంతేనా ఇక?

Kohli Rohit

Kohli Rohit

Virat Kohli & Rohit Sharma’s ODI future and the 2027 World Cup టీమిండియా సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మలు టీ20, టెస్ట్ ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్‌తో సిరీస్ వాయిదా పడడంతో ఇద్దరు మైదానంలోకి దిగడానికి మరిన్ని రోజుల సమయం పట్టనుంది. ఆస్ట్రేలియాపై మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ, రోహిత్‌లు ఆడనున్నారు. అయితే ఇంగ్లండ్‌పై కుర్రాళ్లు ఇంగ్లండ్‌పై అద్భుత ప్రదర్శన చేయడం ఈ సీనియర్‌ ఆటగాళ్లు వన్డే ఫార్మాట్లో కొనసాగడంపై ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఆస్ట్రేలియా సిరీస్‌ అనంతరం దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ ఉంటుంది. 2026 జనవరి, జులై మధ్య న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌తో ఆరు వన్డేలు ఆడే అవకాశముంది. విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మలు మరో ఏడాదిలో మొత్తంగా 12 వన్డేలు ఆడనున్నారు. 2027 నవంబరులో వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. మెగా టోర్నీకి సంసిద్ధం కావడానికి ఈ సీనియర్లకు ఈ మ్యాచ్‌లు సరిపోతాయా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది. కేవలం వన్డేలు, ఐపీఎల్‌తో వన్డే ప్రపంచకప్‌ వరకు ఆటలో ఎలా కొనసాగుతారో అని మరో ప్రశ్న. ఈ నేపథ్యంలోనే కోహ్లీ, రోహిత్‌కు మెగా టోర్నీలో ఆడడం కష్టమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Also Read: Horoscope Today: బుధవారం దినఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!

‘2027 వన్డే ప్రపంచకప్‌నకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అప్పటికి రోహిత్‌కు 40, కోహ్లీకి 38 దాటుతాయి. మెగా టోర్నీకి స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. భారత్ చివరిసారి 2011లో వన్డే ప్రపంచకప్‌ గెలిచింది. ప్రపంచకప్‌లో కుర్రాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. కోహ్లీ, రోహిత్‌లను రిటైర్మెంట్ అంటూ ఒత్తిడి చేస్తారని నేను అనుకోవట్లేదు. అయితే మానసికంగా, శారీరకంగా ఇద్దరి పరిస్థితేంటో తెలుసుకోవడం ముఖ్యం. ఇందుకోసం వాళ్లతో ప్రొఫెషనల్‌గా సంభాషణ ఉంటుంది. వారి నిర్ణయంపై అంతా ఆధారపడి ఉంటుంది’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. వన్డే ప్రపంచకప్‌ గెలవడం రోహిత్ కల అన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల దృష్ట్యా హిట్‌మ్యాన్ కల నెరవేరుతుందా లేదో చూడాలి. 2011 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో కోహ్లీ సభ్యుడు అన్న విషయం తెలిసిందే.

 

Exit mobile version