Virat Kohli: 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా మార్చిన రికార్డ్ ఇదిగో.!
- 18 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం..
- ఎన్నో చారిత్రాత్మక రికార్డులు సృష్టించిన విరాట్ కోహ్లీ..
- రికార్డ్ లిస్ట్ ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: భారత క్రికెట్ చరిత్రలో ‘విరాట్ కోహ్లీ (Virat Kohli)’ పేరు ఒక ప్రత్యేక చాప్టర్. పరుగుల యంత్రంగా, ఛేజింగ్‌లో తిరుగులేని బ్యాటర్‌గా, అద్భుతమైన ఫిట్‌నెస్‌కు ప్రతీకగా, దూకుడైన కెప్టెన్‌గా కోహ్లీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా నిలిచిన కోహ్లీ.. మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. ముఖ్యంగా ఒత్తిడితో ఉన్న మ్యాచ్‌ల్లో బాధ్యత తీసుకుని జట్టును విజయతీరాలకు చేర్చిన తీరు అతడిని అభిమానులకు మరింత దగ్గరికి చేసింది.
అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న కోహ్లీ ప్రయాణంలో ఎన్నో రికార్డులు, అవార్డులు, చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. ప్రపంచకప్ విజయాలు, టెస్టు క్రికెట్లో భారత జట్టుకు బలమైన పునాది వేయడం, వన్డేల్లో పరుగుల వరద పారించడం వంటి ఎన్నో ఘనతలు అతడి కెరీర్లో భాగమయ్యాయి. ఎన్ని మైలురాళ్లు చేరుకున్నా పరుగులపై ఆకలి తగ్గకుండా ముందుకు సాగడం కోహ్లీ ప్రత్యేకత. ‘చీకూ’.. ‘ఛేజ్ మాస్టర్’.. ‘కింగ్’.. ఇవన్నీ విరాట్ కోహ్లీకి క్రికెట్ ప్రపంచం ఇచ్చిన పేర్లు. అయితే ‘చీకూ’ అనే పేరు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టకముందే అతడితో ఉంది. కానీ ‘ఛేజ్ మాస్టర్’, ‘కింగ్’ వంటి బిరుదులు మాత్రం అంతర్జాతీయ క్రికెట్లో 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో కోహ్లీ సాధించిన అద్భుతమైన విజయాల నుంచి వచ్చాయి. మరి అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ సాధించిన రేకేడ్స్ ఏంటో చూసేద్దామా..
Also Read
- Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
- Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే "బీట్రూట్ హల్వా" ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
- IND Vs SL: టీమిండియాకు షాక్.. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ డకౌట్..
- Deputy Tahsildar: దారుణ ఘటన.. ఖమ్మం జిల్లా డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య..
వన్డేల్లో 50కి పైగా సెంచరీలు:
వన్డే క్రికెట్లో 50 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు అతడి ఖాతాలో 54 వన్డే సెంచరీలు ఉన్నాయి.
ఛేజింగ్‌లో అత్యధిక సెంచరీలు:
వన్డేల్లో పరుగుల ఛేజింగ్ సమయంలో కోహ్లీ 29 సెంచరీలు సాధించాడు. వీటిలో 24 సెంచరీలు భారత్ విజయాల్లో రావడం ప్రత్యేక రికార్డు.
అత్యధిక టెస్టు విజయాలు:
భారత టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ 40 విజయాలు సాధించాడు. భారత క్రికెట్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్‌గా నిలిచాడు.
ఒక క్యాలెండర్ ఇయర్లో 11 సెంచరీలు:
ప్రస్తుత అంతర్జాతీయ క్రికెటర్లలో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధికంగా 11 సెంచరీలు చేసిన ఘనత కోహ్లీ పేరిట ఉంది. 2017, 2018 సంవత్సరాల్లో వరుసగా ఈ ఫీట్ సాధించాడు.
అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు:
అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుత ఆటగాళ్లలో అత్యధికంగా 71 ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఆల్‌టైమ్ జాబితాలో సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
టెస్టుల్లో వేగంగా పరుగులు:
టెస్టు క్రికెట్లో 7,000 పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన భారత బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సాధించాడు. 81 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు.
అత్యధిక డబుల్ సెంచరీలు:
టెస్టు కెప్టెన్‌గా 7 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక భారత ఆటగాడు విరాట్ కోహ్లీ. భారత కెప్టెన్లలో ఈ విషయంలో అతడిదే అగ్రస్థానం.
వరుసగా నాలుగు సెంచరీలు:
విదేశీ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో వరుసగా నాలుగు సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు.
వేగవంతమైన టెస్టు సెంచరీ:
2017లో శ్రీలంకతో జరిగిన టెస్టులో కోహ్లీ కేవలం 93 బంతుల్లో సెంచరీ సాధించాడు. దీంతో భారత టెస్టు కెప్టెన్లలో అత్యంత వేగంగా శతకం చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు:
ఒకే వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సాధించాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో 765 పరుగులు చేసి ఈ ఘనత అందుకున్నాడు.
వన్డేల్లో పరుగుల మైలురాళ్లు:
వన్డేల్లో 8,000, 9,000, 10,000, 11,000, 12,000, 13,000, 14,000 పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డులు సృష్టించాడు.
ఐసీసీ రేటింగ్ పాయింట్లు:
క్రికెట్లోని మూడు ఫార్మాట్లలోనూ ICC ర్యాంకింగ్స్‌లో 900కు పైగా రేటింగ్ పాయింట్లు సాధించిన ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.
అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు:
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 22 ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు’ గెలుచుకున్న ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
ఒకే జట్టుపై అత్యధిక వన్డే సెంచరీలు:
శ్రీలంకపై వన్డేల్లో కోహ్లీ 10 సెంచరీలు సాధించాడు. ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన బ్యాటర్‌గా ఇది అతడి ప్రత్యేక రికార్డు.
సెంచరీలు:
శ్రీలంకపై అన్ని ఫార్మాట్లలో కలిపి 15 అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఘనత కూడా కోహ్లీ పేరిట ఉంది.
అత్యధిక వన్డే సెంచరీలు:
వెస్టిండీస్‌పై వన్డే క్రికెట్లో అత్యధికంగా 9 సెంచరీలు చేసిన బ్యాటర్‌గా కూడా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు.
20,000కు పైగా అంతర్జాతీయ పరుగులు:
ఒక దశాబ్దంలో 20,000 లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ. 2011 నుంచి 2020 మధ్య ఈ అరుదైన ఘనతను సాధించాడు.
టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు:
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 7 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
తాజావార్తలు
-
Virat Kohli: 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా మార్చిన రికార్డ్ ఇదిగో.!
-
Anirudh – Kavya Maran Wedding : కావ్య మారన్ – అనిరుధ్ పెళ్ళికి వేదిక రెడీ?
-
Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
-
This Week Theatrical Releases: పృథ్వీరాజ్ ‘ఖలీఫా పార్ట్ 1’ నుండి రవి తేజ ‘ఇరుముడి’ వరకు.. ఈ వారం థియేటర్లలో చూడాల్సిన సౌత్ సినిమాలు..
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
ట్రెండింగ్
-
Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!