Site icon NTV Telugu

Virat Kohli: అన్ని ఆలోచించాకే రిటైర్మెంట్ ప్రకటించా.. కోహ్లీ హాట్ కామెంట్స్

Virat Kohli 1

Virat Kohli 1

Virat Kohli: విరాట్ కోహ్లీ.. పేరుకు ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా క్రికెట్ ప్రపంచానికి. అంతర్జాతీయ వేదికలపై వేలకొద్ది పరుగులు, ఎప్పుడు మైదానంలో అగ్రెసివ్ గా కనిపించే ఈ స్టార్ బ్యాట్స్మెన్ గత ఏడాది టీమిండియా అంతర్జాతీయ టి20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి విధితమే. కోహ్లీ ఈ నిర్ణయం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అలాగే ఆల్ రౌండర్ రవీంద్ర జెడేజాలు కూడా టి20 ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం సంబంధించి తాజాగా కోహ్లీ వివరణ ఇచ్చాడు.

Read Also: Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఇంకా తగ్గుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే?

తన రిటైర్మెంట్ అంత సులువుగా జరిగింది కాదని.. ఎన్నో ఆలోచించి తను ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.. ముఖ్యంగా భారత జట్టులోకి యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లీ తెలిపారు. తాను అన్ని ఆలోచించిన తర్వాతనే టీ20 లకు రిటైర్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. తాను రిటైర్మెంట్ తీసుకుంటే జట్టులోకి కుర్ర ఆటగాళ్లు వస్తారని.. వారి భవిష్యత్తు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Read Also: GT vs SRH: వీరబాదుడు బాదిన జీటి బ్యాటర్లు.. ఎస్ఆర్‌హెచ్ ముందు భారీ టార్గెట్!

వచ్చే ప్రపంచ కప్ మరో రెండేళ్లలో రానున్నడంతో అందుకు సిద్ధంగా ఉండేందుకు కొత్త ఆటగాళ్లు అవసరం కావడంతో తాను ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తాజాగా జరిగిన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో కోహ్లీ తన ఇంటర్నేషనల్ టి20 రిటైర్మెంట్ పై వ్యాఖ్యలు చేశాడు. టి20 లకు వీడ్కోలు చెప్పినా.. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్ లో మాత్రం విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. 2005 ఐపీఎల్ సీజన్ లో 10 మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ 138 పైగా స్ట్రైక్ రేటుతో 443 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ లిస్టులో మూడో స్థానంలో కోహ్లీ కొనసాగుతున్నాడు. ఈ ఐపీఎల్ లో 10 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ ఆరు హాఫ్ సెంచరీలు సాధించాడు అంటే అతడి ఫామ్ అర్థం చేసుకోవచ్చు.

Exit mobile version