Virat Kohli: లండన్‌కి మకాం మార్చిన కోహ్లీ?.. విదేశీ ప్లేయర్ అంటూ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విరాట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో దుమ్ము రేపుతున్నాడు. మొదటి మ్యాచ్‌లో మంచి ఫామ్‌లో ఉన్నట్లు కనిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తరఫున అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గత సీజన్‌లో తొలిసారిగా కైవసం చేసుకున్న టైటిల్‌ను కాపాడుకోవడంలో ఆర్‌సీబీకి విరాట్ అండగా ఉన్నాడు. అయితే, ఈ టోర్నీకి ముందు కోహ్లీ పెద్దగా ప్రాక్టీస్ సెషన్లలో కనిపించలేదు. జనవరిలో జరిగిన వన్డే సిరీస్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఎక్కువ సమయం గడిపాడు. భారత్‌లో తనపై ఉండే విపరీతమైన క్రేజ్, నిరంతర నిఘా నుంచి దూరంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఎక్కువగా లండన్‌లో ఉండటంపై సోషల్ మీడియాలో చర్చలు జోరందుకున్నాయి. తాజాగా ఆర్‌సీబీ కంటెంట్ క్రియేటర్ ‘మిస్టర్ నాగ్స్’ (డానిష్ సేత్) తో జరిగిన సరదా సంభాషణలో ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. “కోహ్లీ లండన్‌లో ఉంటున్నారు కాబట్టి.. ఆర్‌సీబీ ఈసారి నలుగురు కాదు, ఐదుగురు ఓవర్సీస్ (విదేశీ) ప్లేయర్లతో ఆడుతోందని అందరూ జోకులు వేస్తున్నారు, దీనిపై మీరేమంటారు?” అని అడగ్గా.. కోహ్లీ నవ్వుతూ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. “నన్నెందుకు అడుగుతున్నావు? వెళ్లి ఆ విదేశీ ఆటగాళ్లనే అడుగు. నేనేం ఓవర్సీస్ ప్లేయర్‌ని కాదు కదా? నేనేమైనా విదేశీ ఆటగాడిలా కనిపిస్తున్నానా?” అంటూ సరదాగా కొట్టిపారేశారు.
READ MORE: Iran-Israel: ఇరాన్, లెబనాన్‌పై ఏకకాలంలో ఇజ్రాయెల్ దాడులు.. మంటల్లో పలు భవనాలు
Also Read
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీ (Virat Kohli).. భార్య, పిల్లలతో కలిసి త్వరలో లండన్‌లో స్థిరపడతాడని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. తన రిటైర్మెంట్ అనంతరం మిగిలిన జీవితాన్ని లండన్‌లోనే గడపాలనుకుంటున్నాడట. ఈ విషయాన్ని కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ గతంలో వెల్లడించారు. గత కొన్నేళ్లుగా కోహ్లీ తరచూ లండన్‌లో పర్యటనకు వెళ్లడం దీనికి బలం చేకూరుస్తోంది. కోహ్లీ, అనుష్క దంపతుల కుమారుడు అకాయ్ సైతం లండన్‌లోనే జన్మించడం గమనార్హం. కోహ్లీ కుటుంబం గతేడాది, ఈ ఏడాది సైతం ఎక్కువ కాలం లండన్‌లో గడిపింది. అక్కడ కోహ్లీకి ఆస్తులు కూడా ఉన్నాయట. ‘అవును.. విరాట్ తన పిల్లలు, భార్య అనుష్క శర్మతో కలిసి లండన్ వెళ్లాలని యోచిస్తున్నాడు. అతను భారత్‌ను వదిలి అతి త్వరలో యూకేకు షిఫ్ట్ కాబోతున్నాడు. అయితే, ప్రస్తుతం కోహ్లీ క్రికెట్‌తో పాటు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు’ అని గతంలో రాజ్‌కుమార్ శర్మ తెలిపారు.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?