Site icon NTV Telugu

Virat Kohli: హాట్ బ్యూటీ ఫొటోకి లైక్.. నెట్టింటా రచ్చ.. క్లారిటీ ఇచ్చిన కోహ్లీ

Kohli

Kohli

భారత జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరోసారి వార్తల్లో నిలిచాడు. కోహ్లీ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ఒక పని చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి ఓ హాట్ బ్యూటీ ఫొటోకి లైక్ కొట్టడమే. నటి అవనీత్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్‌ను ఆయన లైక్ చేసి, వెంటనే దానిని తొలగించడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 23 ఏళ్ల నటి ఫోటోను లైక్ చేసినందుకు కోహ్లీ ట్రోల్ అయ్యాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చెలరేగడంతో, విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు.

Also Read:The Paradise: నాని కోసం రంగంలోకి మరో సంస్థ ?

ఏప్రిల్ 30వ తేదీన నటి అవనీత్ కౌర్ కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ను విరాట్ కోహ్లీ తొలుత లైక్ చేసినట్లు కొందరు నెటిజన్లు గుర్తించారు. అవనీత్ కౌర్ ఫోటోను కోహ్లీ లైక్ చేసినట్లు కనిపించే స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే, కొద్దిసేపటికే ఆ లైక్‌ను ఆయన డిస్ లైక్ చేశారు. ఈ విషయం మరింత తీవ్రం కావడం గమనించిన కోహ్లీ, దీనిపై ఎలాంటి అపార్థం తలెత్తకుండా ఉండేందుకు తన వివరణ ఇచ్చాడు.

Also Read:Goa Stampede: గోవాలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి.. 50 మందికి గాయాలు

కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చాడు.. నేను నా ఫీడ్‌ను క్లియర్ చేస్తున్నప్పుడు పొరపాటున జరిగి ఉండొచ్చని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. అల్గారిథమ్ వల్ల ఈ ఇంటరాక్షన్ (లైక్) పొరపాటున నమోదై ఉండవచ్చు. దీని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదు. అనవసరమైన ఊహాగానాలు చేయవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అర్థం చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు అని కోహ్లీ తెలిపాడు.

Also Read:WAVES 2025 : OTT ల పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన అమీర్ ఖాన్..

ఐపీఎల్ 2025లో కోహ్లీ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 138.87 స్ట్రైక్ రేట్‌తో 443 పరుగులు చేశాడు. IPL 2025లో కోహ్లీ ఆరు హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుత సీజన్‌లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, విరాట్ కోహ్లీ నాలుగుసార్లు 50 పరుగులకు పైగా ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇది మాత్రమే కాదు, టీ20 క్రికెట్‌లో 13000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు.

Exit mobile version