Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Virat Kohli Is The Only Cricketer In The Top 10 For The Alimo Philips Greatest Athletes List

Virat Kohli: ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ అథ్లెట్ల జాబితాలో విరాట్‌ కోహ్లీ.. ఏకైక క్రికెటర్‌గా..!

Published Date :February 5, 2024 , 8:07 am
By Sampath Kumar
Virat Kohli: ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ అథ్లెట్ల జాబితాలో విరాట్‌ కోహ్లీ.. ఏకైక క్రికెటర్‌గా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Virat Kohli in Alimo Philip’s Greatest Athletes List: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ అంతర్జాతీయ స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ ‘అలిమో ఫిలిప్‌’ ఎంపిక చేసిన ఆల్‌టైమ్‌ గ్రేట్‌ అథ్లెట్ల జాబితాలో కోహ్లీకి చోటు దక్కింది. ఈ జాబితాలో కింగ్ కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. అలిమో ఫిలిప్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ అథ్లెట్ల జాబితాలో టాప్‌ 10లో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్‌ విరాట్‌ మాత్రమే. ‘ఫేస్‌ ఆఫ్‌ ద క్రికెట్‌’గా కోహ్లీని అలిమో ఫిలిప్‌ అభివర్ణించాడు.

ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ అథ్లెట్ల జాబితాలో అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్ లియోనల్‌ మెస్సీ అగ్రస్థానంలో నిలిచాడు. పోర్చుగల్‌ స్టార్ క్రిస్టియానో రొనాల్డో రెండో స్థానంలో ఉన్నాడు. బాక్సింగ్‌ లెజెండ్‌ మొహమ్మద్‌ ఆలీ మూడో స్థానంలో, బాస్కెట్‌బాల్‌ కింగ్‌ మైఖేల్‌ జోర్డన్‌ నాలుగో స్థానంలో ఉండగా.. భారత స్టార్ క్రికెటర్ విరాట్‌ కోహ్లీ ఐదవ స్థానంలో ఉన్నాడు. పరుగుల రారాజు ఉసేన్‌ బోల్ట్‌ ఆరో స్థానంలో ఉండగా.. అమెరికా మాజీ టెన్నిస్‌ ప్లేయర్ సెరెనా విలియమ్స్‌ తొమ్మిదవ స్థానంలో ఉంది. టాప్‌ 10 అథ్లెట్ల జాబితాలో సెరెనా మాత్రమే మహిళ కావడం విశేషం.

Also Read: Kane Williamson: బ్రాడ్‌మన్‌, కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన కేన్‌ మామ!

అంతర్జాతీయ కెరీర్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 113 టెస్టులు, 292 వన్డేలు, 117 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టులో 8848, వన్డేల్లో 13848, టీ20ల్లో 4037 రన్స్ చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 80 సెంచరీలు చేశాడు. మూడు ఫార్మాట్లలో 26,733 రన్స్ బాదాడు. ప్రస్తుతం టీమిండియాకు విరాట్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తన భార్య అనుష్క శర్మ గర్భంతో ఉన్న కారణంగా అతడు జట్టుకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో 5 మ్యాచుల టెస్ట్‌ సిరీస్‌ ఆడుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Alimo Philip
  • Alimo Philip Greatest Athletes List
  • VIRAT KOHLI
  • Virat Kohli Alimo Philip
  • virat kohli record

తాజావార్తలు

  • Xiaomi TV S Mini LED 2026: షియోమీ 100 అంగుళాల స్క్రీన్స్, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో.. కొత్త 4K స్మార్ట్ టీవీలు విడుదల

  • Pakistan Demands Nobel Peace Prize: షాబాజ్ షరీఫ్, మునీర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి.. పాకిస్తానీల వింత డిమాండ్‌..

  • Onion Rice Recipe: అమ్మల కష్టానికి ఫుల్ స్టాప్.. ఉదయాన్నే హడావిడి లేకుండా 10నిమిషాల్లో టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ..

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్.. ఎంత పోలింగ్ నమోదైందంటే..!

  • AK64 : అజిత్ కుమార్ డబుల్ రోల్: అటు రేసింగ్.. ఇటు షూటింగ్!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions