విరాట్ కోహ్లీ.. ప్రస్తుత తరంలో అగ్రశ్రేణి బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డుల మీద కన్నేసిన ఇతడు.. అదే దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మరో రెండు రోజుల్లో మొదలుకానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముంగిట కోహ్లీని మరో రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. కోహ్లీ మరో 64 పరుగులు చేస్తే క్రికెట్‌లో అత్యంత వేగంగా 25 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ ఇప్పటి వరకు 546 ఇన్నింగ్స్‌ల్లో 24,936 రన్స్ చేశాడు.’
Also Read: Turkey Earthquake: సందట్లో సడేమియా.. 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు పరార్..
ఇక, అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ కంటే ముందు 25వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (782 ఇన్నింగ్స్‌ల్లో 34,357 పరుగులు) మొదటి స్థానంలో ఉండగా.. కుమార సంగక్కర (666 ఇన్నింగ్స్‌ల్లో 28,016 పరుగులు), రికీ పాంటింగ్ (688 ఇన్నింగ్స్‌ల్లో 27,483 పరుగులు), మహేళ జయవర్ధనే (725 ఇన్నింగ్స్‌ల్లో 25,957 పరుగులు), జాక్వెస్ కలిస్ (617 ఇన్నింగ్స్‌ల్లో 25,534) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. దీంతో వచ్చే సిరీస్‌లో కోహ్లీ మరో 64 రన్స్ పూర్తి చేస్తే 25వేల రన్స్ పూర్తి చేసిన రెండో ఇండియన్‌గా, ఓవరాల్‌గా ఆరో బ్యాటర్‌గా నిలుస్తాడు.
Also Read: Ravi Ashwin: బాయ్స్‌కు ‘B’తో స్టార్ట్ అయ్యేదే కావాలన్న అమ్మాయి..అశ్విన్ దిమ్మతిరిగే ఆన్సర్
అలాగే, ఈ సిరీస్ ద్వారా కోహ్లీ ఖాతాలో మరో రికార్డు కూడా చేరే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో విరాట్ మరో రెండు సెంచరీలు సాధిస్తే.. ఆస్ట్రేలియాపై అత్యధిక శతకాలు బాదిన రెండో భారత బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటికే ఆసీస్‌పై సచిన్ 11 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. గవాస్కర్ 8 సెంచరీలతో రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. కోహ్లీ ఏడు శతకాలతో ఉండగా.. మరో రెండు 100లు బాదితే గవాస్కర్‌ను దాటి రెండో ప్లేస్‌కు చేరతాడు.