Ravi Ashwin: బాయ్స్‌కు ‘B’తో స్టార్ట్ అయ్యేదే కావాలన్న అమ్మాయి..అశ్విన్ దిమ్మతిరిగే ఆన్సర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రవిచంద్రన్ అశ్విన్..అటు మైదానంలోనే కాక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఫీల్డ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్లకు కౌంటర్లు ఇస్తూనే సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లకు చురకలు అంటిస్తుంటాడు. తనదైన కౌంటర్లతో ఫ్యాన్స్ చేత ఔరా అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా అశ్విన్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట నవ్వులు పూయించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా మొదలుకానుంది. ప్రస్తుతం ఈ సిరీస్ కోసం ఇరుజట్ల ఆటగాళ్లూ ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ అశ్విన్ ఓ ట్విట్టర్ యూజర్ చేసిన కామెంట్‌కు ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ‘అబ్బాయిలకు ఒక్కటే కావాలి, అది B అనే ఇంగ్లీష్ పదంతో స్టార్ట్ అవుతుంది’ అని ఓ అమ్మాయి ట్వీట్ చేయగా.. ‘బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ’ అంటూ అశ్విన్ సమాధానం చెప్పాడు. ఆ అమ్మాయి ఉద్దేశంలో ఇది కరెక్టో కాదో తెలీదు కానీ అశ్విన్ ఇచ్చిన సమాధానం మాత్రం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది.

అశ్విన్ ట్వీట్
Also Read
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
- Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే "రాగి" పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
దీంతో అశ్విన్‌కు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు ఓ అమ్మాయి చేసిన కామెంట్‌పై కూడా చాలామంది స్పందిస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు సమాధానాలు చెబుతున్నారు. కొందరేమో బహిరంగంగా వాడకూడని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి BGT 2023లో తొలి టెస్టు ముందు ఓ సరదా సంభాషణతో అశ్విన్ టీమిండియా అభిమానులను అలరించాడు.
Also Read: WPL 2023: విమెన్స్ లీగ్ ప్రారంభం ఆరోజే..ఐపీఎల్ ఛైర్మన్ ప్రకటన
ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అశ్విన్ పాత్ర ఎంత కీలకమైనదో అందరికీ తెలిసిందే. భారత్-ఆసీస్‌ల మధ్య ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ జరిగినా అశ్విన్ కీ రోల్ ప్లే చేస్తాడు. ఈ సిరీస్‌లోనూ అతడు ప్రధాన పాత్ర పోషిస్తాడని అందరూ అంచనా వేస్తున్నారు. స్పిన్‌కు సహకరించే పిచ్‌లపై అశ్విన్ బంతితో పాటు బ్యాట్‌తో ఏ రకంగా రెచ్చిపోతాడో గతంలో చాలా సందర్భాల్లో మనం చూశాం. ఈ సిరీస్‌లో టీమిండియా స్పిన్ విభాగాన్ని లీడ్ చేసే అశ్విన్‌కు ఆసీస్ స్టార్ ఆటగాళ్లు వార్నర్, స్టీవ్ స్మిత్, లబూషేన్‌ల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో అశ్విన్ మరో వికెట్ తీస్తే.. టెస్ట్‌ల్లో 450 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు.
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!