Virat Kohli: అరుదైన రికార్డు ముంగిట కోహ్లీ..మరో 64 రన్స్ చేస్తే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విరాట్ కోహ్లీ.. ప్రస్తుత తరంలో అగ్రశ్రేణి బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డుల మీద కన్నేసిన ఇతడు.. అదే దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మరో రెండు రోజుల్లో మొదలుకానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముంగిట కోహ్లీని మరో రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. కోహ్లీ మరో 64 పరుగులు చేస్తే క్రికెట్‌లో అత్యంత వేగంగా 25 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ ఇప్పటి వరకు 546 ఇన్నింగ్స్‌ల్లో 24,936 రన్స్ చేశాడు.’
Also Read: Turkey Earthquake: సందట్లో సడేమియా.. 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు పరార్..
Also Read
ఇక, అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ కంటే ముందు 25వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (782 ఇన్నింగ్స్‌ల్లో 34,357 పరుగులు) మొదటి స్థానంలో ఉండగా.. కుమార సంగక్కర (666 ఇన్నింగ్స్‌ల్లో 28,016 పరుగులు), రికీ పాంటింగ్ (688 ఇన్నింగ్స్‌ల్లో 27,483 పరుగులు), మహేళ జయవర్ధనే (725 ఇన్నింగ్స్‌ల్లో 25,957 పరుగులు), జాక్వెస్ కలిస్ (617 ఇన్నింగ్స్‌ల్లో 25,534) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. దీంతో వచ్చే సిరీస్‌లో కోహ్లీ మరో 64 రన్స్ పూర్తి చేస్తే 25వేల రన్స్ పూర్తి చేసిన రెండో ఇండియన్‌గా, ఓవరాల్‌గా ఆరో బ్యాటర్‌గా నిలుస్తాడు.
Also Read: Ravi Ashwin: బాయ్స్‌కు ‘B’తో స్టార్ట్ అయ్యేదే కావాలన్న అమ్మాయి..అశ్విన్ దిమ్మతిరిగే ఆన్సర్
అలాగే, ఈ సిరీస్ ద్వారా కోహ్లీ ఖాతాలో మరో రికార్డు కూడా చేరే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో విరాట్ మరో రెండు సెంచరీలు సాధిస్తే.. ఆస్ట్రేలియాపై అత్యధిక శతకాలు బాదిన రెండో భారత బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటికే ఆసీస్‌పై సచిన్ 11 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. గవాస్కర్ 8 సెంచరీలతో రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. కోహ్లీ ఏడు శతకాలతో ఉండగా.. మరో రెండు 100లు బాదితే గవాస్కర్‌ను దాటి రెండో ప్లేస్‌కు చేరతాడు.
తాజావార్తలు
-
Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
-
Kerala: ‘‘కాంగ్రెస్ ముస్లిం లీగ్’’.. సీఎం ఎంపికపై బీజేపీ ఫైర్..
-
Vizag: విశాఖలో ఘోర విషాదం.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
-
Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
-
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ గిఫ్ట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్‌ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్‌ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?