Site icon NTV Telugu

Virat Kohli: లండన్ వీధుల్లో భార్యతో కలిసి స్వేచ్ఛగా షికార్లు కొడుతున్న కోహ్లీ.. వీడియో వైరల్

Virat Kohli

Virat Kohli

Virat Kohli: విరాట్ కోహ్లీ.. అది పేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్. టాప్ రేటెడ్ బ్యాట్స్‌మన్‌గా ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభతో పేరుగాంచిన ఈ క్రికెటర్ 2008 లో అంతర్జాతీయ క్రికెట్‌లో డెబ్యూ చేసి టీ20, టెస్ట్, ODIలో భారత జట్టు కోసం అనేక రికార్డులు సృష్టించారు. కోహ్లీ 2014 నుండి 2022 వరకు భారత జట్టు కెప్టెన్‌గా కొనసాగారు. ఇక గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీ20 లకు రిటైర్మెంట్ ఇచ్చిన ఆయన, ఆ తర్వాత టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చారు. దీనితో ప్రస్తుతం వన్డే టీంలో మాత్రమే ఆయన కొనసాగనున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం టీమిండియాకు ఎలాంటి మ్యాచ్ లు లేకపోవడంతో కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి లండన్ విధుల్లో సంతోషంగా, అందంగా విహరిస్తున్నారు.

kidney problems : కిడ్నీలు ఒత్తిడికి గురైనప్పుడు కనిపించే 7 సంకేతాలు..

కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి తాజాగా మరోసారి లండన్ వీధుల్లో నడుస్తూ స్థానికులతో కలసి సందడి చేశారు. లండన్ విధుల్లో సాధారణ నడక సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన కోహ్లీ అభిమానులు చాలా భావోద్వేగం చెందుతున్నారు. విరాట్ కోహ్లీ ప్రఖ్యాతి కంటే శాంతిని ఎంచుకున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి కోహ్లీ విరామంలో ఉన్నప్పటికీ ఆయన అక్టోబర్ నుండి ఆస్ట్రేలియాతో జరగనున్న ODI సిరీస్‌లో పాల్గొననున్నారు. కోహ్లీ, భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరు టెస్టులతో పాటు T20I క్రికెట్‌లో రిటైర్ అయినందున రాబోయే ODI ప్రపంచకప్ 2027 కోసం టీమ్‌లో స్థానం పొందడంపై అనేక ఆటంకాలు వినిపిస్తున్నాయి.

JC Prabhakar vs Pedda Reddy: తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్‌.. జేసీ వర్సెస్‌ కేతిరెడ్డి..!

టీమిండియా అక్టోబర్ నుండి 2026 ఐపీఎల్ వరకు కేవలం తొమ్మిది ODIలు మాత్రమే ఆడనుంది. అంటే కోహ్లీకి అంతర్జాతీయ ఆట రోజుల పరిమితి చాలా తక్కువగా ఉంది. ప్రపంచకప్ వరకు మిగిలిన సుమారు రెండు సంవత్సరాలలో కోహ్లీ, రోహిత్ తమ అత్యుత్తమ ఫారం నిలుపుకోవడం కష్టతరమైన పని అనే చెప్పవచ్చు.

Exit mobile version