Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ క్రీజ్‌లోకి వచ్చి బ్యాటింగ్ చేస్తుంటే కుర్ర క్రికెటర్లలో ఒకటే ఆసక్తి ఉంటుంది. ఆయన అసలు ఏ బ్యాట్‌తో కొడుతున్నాడు? ఆ బ్యాట్ ప్రత్యేకత ఏంటి? అని తెలుసుకోవాలని తెగ ఆరాటపడతారు. రీసెంట్గా వెస్టిండీస్‌పై కోహ్లీ 9 సిక్సర్లతో విరుచుకుపడి, 139 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అసలు విరాట్ లాంటి అంతర్జాతీయ క్రికెటర్లు ఎలాంటి బ్యాట్లు వాడతారు? వాటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అయితే, విరాట్ కోహ్లీతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్లంతా ‘ఇంగ్లీష్ విల్లో’ బ్యాట్లకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఇంగ్లీష్ విల్లో బ్యాట్లతో మణికట్టును (రిస్ట్) చాలా బాగా ఉపయోగిస్తూ పెద్ద పెద్ద షాట్లు ఆడవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా కోహ్లీ తన రిస్ట్ వర్క్‌ను అద్భుతంగా ఉపయోగించి ఏకంగా 9 సిక్సర్లు బాదాడు. ప్లేయర్లు తమ బ్యాటింగ్ స్టైల్‌కి తగ్గట్టుగా బ్యాట్లను కస్టమైజ్ చేయించుకుంటారు. అలా తయారు చేయించుకోవడం వల్లే మైదానంలో విస్ఫోటనాత్మక బ్యాటింగ్‌తో జట్టును విజేతగా నిలబెట్టగలుగుతారు.
Also Read
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
- Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
ఈ ఇంగ్లీష్ విల్లో బ్యాట్ అంత ప్రత్యేకం ఎందుకంటే..?
ఈ బ్యాట్ బరువు తక్కువగా ఉండటంతో పాటు చేతిలో పట్టుకుని తిప్పడానికి (పికప్) చాలా సులభంగా ఉంటుంది. బ్యాట్స్‌మెన్‌కి సరైన టైమింగ్, నైపుణ్యం ఉంటే చాలు.. బంతి వచ్చి ఈ బ్యాట్‌కి తగలగానే ఈజీగా ఫోర్లు, సిక్సర్లుగా మలిచేయవచ్చు. అంతేకాదు కవర్ డ్రైవ్, కట్, స్ట్రెయిట్ డ్రైవ్‌ల లాంటి షాట్లు ఆడటానికి బ్యాట్ స్వింగ్ చేయడం చాలా తేలికవుతుంది. దీనివల్ల ఆటగాళ్లు మంచి బ్యాలెన్స్‌తో షాట్లు ఆడగలరు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వాడే బ్యాట్ విషయానికొస్తే.. ఇంగ్లీష్ విల్లో చెట్టులోని అత్యుత్తమమైన భాగం నుంచి దీన్ని తయారు చేస్తారు. అందుకే ఈ బ్యాట్ల ధర లక్షల్లో ఉంటుంది. ఒకప్పుడు కేవలం నేషనల్, ఇంటర్నేషనల్ ప్లేయర్లు మాత్రమే వాడే ఈ ఇంగ్లీష్ విల్లో బ్యాట్లకు ఇప్పుడు క్రేజ్ విపరీతంగా పెరిగింది. ప్రొఫెషనల్ క్రికెట్లో వీటి వాడకం పెరగడంతో పాటు యంగ్ క్రికెటర్లు కూడా ఈ బ్యాట్ల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రో ప్లేయర్లకు వివిధ స్పోర్ట్స్ కంపెనీలు స్పాన్సర్షిప్ రూపంలో బ్యాట్లను ఇస్తుంటాయి. వీటి అసలు ధరను కచ్చితంగా అంచనా వేయడం కష్టమే అయినా, ఇవి ఖచ్చితంగా లక్షల రూపాయల్లోనే ఉంటాయి. సాధారణ మార్కెట్ ధరకు వస్తే.. మీరట్ మార్కెట్లో రూ. 10,000 నుంచి రూ. 2,00000 వరకు ఇంగ్లీష్ విల్లో బ్యాట్లు దొరుకుతాయి.
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!