Virat Kohli: వడోదర వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. 301 పరుగుల లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌కు గాను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఇది విరాట్ వన్డే కెరీర్‌లో 45వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 71వ అవార్డు కావడం విశేషం.
ఇక పోస్టు మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ప్రెజెంటర్ హర్ష భోగ్లే మాట్లాడుతూ.. 45 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అంటే చాలా పెద్ద సంఖ్య. వాటిని ఉంచుకోవడానికి ప్రత్యేక గది అవసరమయ్యే ఉంటుంది కదా? అని విరాట్‌ను ప్రశ్నించారు. దీనికి విరాట్ ఎంతో భావోద్వేగంగా సమాధానం ఇచ్చాడు. నేను ఆ అవార్డులన్నీ నా అమ్మకు పంపిస్తాను. గురుగ్రామ్‌లో ఉన్న ఆమె వాటిని ఎంతో ఇష్టంగా దగ్గర పెట్టుకుంటారు. నా విజయాలు ఆమెకు గర్వంగా అనిపిస్తాయి. అందుకే అవన్నీ అమ్మకే ఇస్తానని చెప్పాడు.
మీ Phone Battery త్వరగా అయిపోతోందా.? ఈ 3 Settings మార్చితే బ్యాటరీ లైఫ్ పెరగడం ఖాయం.!
అంతర్జాతీయంగా క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల విషయానికి వస్తే.. ఈ లిస్ట్ లో విరాట్ కోహ్లీ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. అతనికంటే ముందు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ 76 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకోగా.. విరాట్ ఇప్పటివరకు 71 అవార్డులు సాధించాడు. వీరిద్దరి మధ్య కేవలం 5 అవార్డుల తేడా మాత్రమే ఉండటంతో త్వరలోనే ఈ రికార్డును విరాట్ అధిగమించే అవకాశాలు ఉన్నాయి.
Harsha Bhogle: 45 POTM, how big is your house? You need room for all those awards.
Virat Kohli: Well, I send it to my mom in Gurgaon. She likes keeping all the trophies, she feels proud. 🥹❤️ pic.twitter.com/uoMnrXQJR9
— Suprvirat (@Mostlykohli) January 11, 2026
