Site icon NTV Telugu

Virat Kohli: ఆగ్రహంతో ఊగిపోయిన కింగ్ కోహ్లి.. వైరల్ వీడియో..!

15

15

ప్రస్తుతం ఐపీఎల్ 2024 లో భాగంగా సోమవారం నాడు ఆర్సీబీ బౌలర్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల బాట్స్మెన్స్ పరుగుల వరద సృష్టించారు. కొడితే సిక్స్.. లేకపోతే ఫోర్.. బాల్ పడింది అంటే చాలు బ్యాట్ తగిలి బాల్ బౌండరీ లైన్ అవతలపడాల్సిందే. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ ట్రావిస్‌ హెడ్‌ 41 బంతుల్లో 102 పరుగులతో ఓవైపు ఊచకోత కోస్తుంటే.. మరోవైపు హెన్రిచ్‌ క్లాసెన్‌ 31 బంతుల్లో 67 పరుగులతో ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశారు. వీరిద్దరి తుఫాన్‌ ఇన్నింగ్స్‌ దెబ్బకి ఆరెంజ్‌ ఆర్మీ కేకలతో స్టేడియంలో రెచ్చిపోగా.. ఆర్సీబీ ఫ్యాన్స్‌ మాత్రం జరుగుతున్న పరుగుల విధ్వంసాన్ని చూస్తూ తమలో తామే మదనపడిపోతూ సతమతమయ్యారు.

Also read: Uttarakhand: నేపాల్‌ – ఉత్తరాఖండ్‌ సరిహద్దుల మూసివేత.. ఎందుకంటే..?!

ఇక చూడడానికి వచ్చిన అభిమానుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ఆర్సీబీ ఆటగాళ్ల పరిస్థితి ఇంకెలా ఉంటుందో.. ఒకసారి మీరే ఆలోచించండి. ఆర్సీబీ వికెట్‌ తీయడం సంగతి పక్కన పెడితే.. ముందు పరుగుల ప్రవాహానికి కట్టడి చేయడం ఎలా అని తలలు పట్టుకున్నారు. ఇక ఆర్సీబీ బ్రాండ్ అంబాసిడర్ గా భావించే స్టార్‌ విరాట్‌ కోహ్లి అయితే.. తీవ్ర అసహానికి లోనయ్యాడు.

Also read: Lamba Dinakar : నేడు ఆర్ధికంగా అన్ని ఆదాయాలు పడిపోయి.. అవస్థలు పడుతున్నారు

సన్ రైజర్స్‌ బ్యాటర్లు తమ సొంత మైదానంలో ఎడతెరపి లేకుండా పరుగుల వరద సృష్టిస్తుంటే.. అస్సలు చూడలేకపోయాడు. మ్యాచ్ ఇన్నింగ్స్ లో వారిని కట్టడి చేయలేక బౌలర్లు చేతులెత్తేస్తుంటే గాల్లోకి కాలితో పంచ్‌ లు విసురుతూ తన కోపాన్ని వెళ్లగక్కాడు కోహ్లీ. ఇక అలాగే వికెట్‌ పడినప్పుడల్లా.. జట్టును ఉత్సాహపరుస్తూ., చప్పట్లు కొడుతూ తన సంతోషం వ్యక్తం చేశాడు. ఇక సన్‌ రైజర్స్‌ బ్యాటింగ్‌ పూర్తి అయ్యే వరకు కోహ్లి ఇచ్చిన అనేకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌, రియాక్షన్స్‌ చూసి ఫ్యాన్స్‌.. ‘‘అయ్యో పాపం ఆర్సీబీ’’ అంటూ వారి సానుభూతిని తెలుపుతున్నారు.

Exit mobile version