NTV Telugu Site icon

Virat Kohli: ఆస్ట్రేలియా అభిమానులపై గుస్సాయించిన విరాట్ కోహ్లీ.. (వీడియో)

Kohli

Kohli

Virat Kohli Fire On Australia Fans: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో విరాట్ కోహ్లీని ఆసీస్‌ అభిమానులు అవమానించిన ఘటన రెండో రోజు ఆటలో జరిగింది. ఇందుకు సంబంధించి చూస్తే.. విరాట్ 86 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే అతను ఆడుతున్నప్పుడు ఏకాగ్రతతో బ్యాటింగ్ చేశాడు. మొదట ఆఫ్‌సైడ్‌ బంతులను ఆడకుండా వదిలేస్తూ ‘క్రమశిక్షణ’ పాటిస్తున్నట్లుగా ఆయన కనిపించినా, చివరికి అదే బలహీనతను పునరావృతం చేసి మరోసారి బలయ్యాడు. బోలాండ్ వేసిన ఆఫ్‌సైడ్ బంతిని కదిలించి వికెట్ కీపర్ చేతికి చిక్కిన కోహ్లీ పెవిలియన్‌ కు చేరుకున్నాడు.

Also Read: Rewind 2024 Mollywood : కలెక్షన్సే కాదు.. ప్రశంసలు సైతం దక్కించుకున్న మాలీవుడ్

కోహ్లీ, యశస్వి జైస్వాల్ తో కలిసి 3వ వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత జైస్వాల్ రనౌట్ కావడంతో కోహ్లీ సహనం కోల్పోయి మరోసారి ఆఫ్ స్టంప్‌ బంతిని ఆడి వికెట్ కీపర్‌కు చిక్కాడు. ఇక కోహ్లీ ఔట్‌ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళుతుండగా, కొంతమంది ఆసీస్‌ అభిమానులు అతన్ని ఎగతాళి చేశారు. వారు మాటలు, చేతలతో కోహ్లీని రెచ్చగొట్టారు. ఈ వ్యాఖ్యలు, ఆసీస్‌ అభిమానుల ప్రవర్తనతో కోహ్లీకి తీవ్రంగా కోపాన్ని తెప్పించాయి.

ఈ నేపథ్యంలో ముందుకు వెళ్లిన కోహ్లీ మళ్లీ వెనక్కి తిరిగి వారిపై సీరియస్‌గా చూశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ విషయం సంబంధించి ఆస్ట్రేలియా అభిమానుల ప్రవర్తనను ఖండించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 164/5 స్కోరు చేయగా.. రిషభ్ పంత్ (6*), రవీంద్ర జడేజా (4*) పరుగులతో క్రీజులో ఉన్నారు.టీమిండియా ఫాలో ఆన్‌ను తప్పించుకోవాలంటే భారత్‌కు ఇంకా 111 పరుగులు అవసరం.