Virat Kohli: ఆస్ట్రేలియా అభిమానులపై గుస్సాయించిన విరాట్ కోహ్లీ.. (వీడియో)
- బాక్సింగ్ డే టెస్టులో
- ఆస్ట్రేలియా అభిమానులపై
- గుస్సాయించిన విరాట్ కోహ్లీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Fire On Australia Fans: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో విరాట్ కోహ్లీని ఆసీస్ అభిమానులు అవమానించిన ఘటన రెండో రోజు ఆటలో జరిగింది. ఇందుకు సంబంధించి చూస్తే.. విరాట్ 86 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే అతను ఆడుతున్నప్పుడు ఏకాగ్రతతో బ్యాటింగ్ చేశాడు. మొదట ఆఫ్‌సైడ్ బంతులను ఆడకుండా వదిలేస్తూ ‘క్రమశిక్షణ’ పాటిస్తున్నట్లుగా ఆయన కనిపించినా, చివరికి అదే బలహీనతను పునరావృతం చేసి మరోసారి బలయ్యాడు. బోలాండ్ వేసిన ఆఫ్‌సైడ్ బంతిని కదిలించి వికెట్ కీపర్ చేతికి చిక్కిన కోహ్లీ పెవిలియన్ కు చేరుకున్నాడు.
Also Read: Rewind 2024 Mollywood : కలెక్షన్సే కాదు.. ప్రశంసలు సైతం దక్కించుకున్న మాలీవుడ్
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
కోహ్లీ, యశస్వి జైస్వాల్ తో కలిసి 3వ వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత జైస్వాల్ రనౌట్ కావడంతో కోహ్లీ సహనం కోల్పోయి మరోసారి ఆఫ్ స్టంప్ బంతిని ఆడి వికెట్ కీపర్‌కు చిక్కాడు. ఇక కోహ్లీ ఔట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళుతుండగా, కొంతమంది ఆసీస్ అభిమానులు అతన్ని ఎగతాళి చేశారు. వారు మాటలు, చేతలతో కోహ్లీని రెచ్చగొట్టారు. ఈ వ్యాఖ్యలు, ఆసీస్ అభిమానుల ప్రవర్తనతో కోహ్లీకి తీవ్రంగా కోపాన్ని తెప్పించాయి.
The booing Aussie fans should thank god that this Virat Kohli is in his bhajan-kirtan phase.
pic.twitter.com/5mrTQW39Bj— Johns (@JohnyBravo183) December 27, 2024
ఈ నేపథ్యంలో ముందుకు వెళ్లిన కోహ్లీ మళ్లీ వెనక్కి తిరిగి వారిపై సీరియస్‌గా చూశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ విషయం సంబంధించి ఆస్ట్రేలియా అభిమానుల ప్రవర్తనను ఖండించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 164/5 స్కోరు చేయగా.. రిషభ్ పంత్ (6*), రవీంద్ర జడేజా (4*) పరుగులతో క్రీజులో ఉన్నారు.టీమిండియా ఫాలో ఆన్‌ను తప్పించుకోవాలంటే భారత్‌కు ఇంకా 111 పరుగులు అవసరం.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!