Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరో చారిత్రాత్మక ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో 25 పరుగులు పూర్తి చేసిన వెంటనే ఈ స్టార్ తన అంతర్జాతీయ క్రికెట్‌లో 28 వేల పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచి నయా చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో (624) ఈ ఘనతను సాధించాడు. విరాట్ 309 వన్డే మ్యాచ్‌లలో 14,600 పరుగుల మార్కును దాటాడు. ఇందులో 53 సెంచరీలు, 77 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
READ ALSO: Rohit Sharma: హిట్ మ్యాన్ ఖాతాలో వరల్డ్ రికార్డు..
సచిన్ – సంగక్కర రికార్డు బ్రేక్..
ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇద్దరు ఆటగాళ్ళు మాత్రమే 28 వేల కంటే ఎక్కువ పరుగులు చేశారు. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్, శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర మాత్రమే ఈ రికార్డును కలిగి ఉన్నారు. టెండూల్కర్ మొత్తం 782 ఇన్నింగ్స్‌లలో 34,357 పరుగులు చేశాడు. అదే సమయంలో కుమార్ సంగక్కర తన చివరి ఇన్నింగ్స్‌లో 28,000 పరుగుల మార్కును చేరుకున్నాడు. ఆయన 666 ఇన్నింగ్స్‌లలో 28,016 పరుగులు పూర్తి చేశాడు.
విరాట్ కోహ్లీ 28 వేల పరుగుల మైలురాయితోనే ఆగిపోలేదు. కింగ్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో 28 వేల పరుగులు పూర్తి చేసిన వెంటనే, దానికి మరో 17 పరుగులు జోడించి అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ (34,357 పరుగులు) తర్వాత అత్యధిక పరుగులు సాధించిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ కుమార్ సంగక్కర (28,016 పరుగులు) పేరన ఉండేది. కానీ ఇప్పుడు కోహ్లీ సంగక్కరను దాటేశాడు. మొత్తంగా విరాట్ ఈ మ్యాచ్‌లో 93 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
READ ALSO: Women Rule: ఈ దేశంలో పురుషులందరూ బానిసలే..
