Virat Kohli Funny Celebrations Goes Viral After Taking 81 Balls To Hit First Boundary: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా, బౌలర్ ఎవరైనా, మైదానం ఎలాంటిదైనా.. విరాట్ క్రీజులో ఉన్నాడంటే పరుగుల వరద పారాల్సిందే. విరాట్ సిక్స్‌ల కన్నా ఎక్కువగా బౌండరీల ద్వారానే పరుగులు రాబడతాడు. ఫీల్డర్ల మధ్య నుంచి బంతిని అవలీలగా తరలిస్తాడు. అలాంటి కోహ్లీ తాజాగా విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బౌండరీ బాదడానికి చాలా బంతులు తీసుకున్నాడు. ఏకంగా 81వ బంతిని ఫోర్ బాదాడు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ (103), శుభ్‌మన్ గిల్ (6) స్వల్ప వ్యవధిలో ఔట్ అయ్యారు. సెంచరీ చేసి ఊపుమీదున్న యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జత కలిశాడు. ఈ ఇద్దరు భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. షాట్లకు పోకుండా సింగిల్స్ మాత్రమే తీశారు. ఈ క్రమంలో వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 205 బంతుల్లో 72 పరుగులు జోడించారు. తొలి బంతి నుంచీ నిదానంగా ఆడిన కోహ్లీ భారీ షాట్లకు పోలేదు. సింగిల్స్ మాత్రమే తీస్తూ పోయాడు.
చివరకు విరాట్ కోహ్లీ తాను ఎదుర్కొన్న 81వ బంతిని ఫోర్‌గా మలిచాడు. వారికన్ వేసిన ఇన్నింగ్స్ 110వ ఓవర్‌లో కవర్‌డ్రైవ్‌తో బౌండరీ రాబట్టాడు. బంతి బౌండరీని తాకగానే విరాట్ సంబరాలు చేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత సెంటిరీ చేసిన మాదిరిగా సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇది చూసిన విండీస్ ప్లేయర్స్ షాక్ అయ్యారు. ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఫాన్స్ తెగ నవ్వుకుంటున్నారు. ‘విరాట్ భయ్యా సెంచరీ కాలేదు ఇంకా’, ‘ఛెతేశ్వర్ పుజారా లేని లోటును విరాట్ కోహ్లీ తీరుస్తున్నాడు’ అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Food Inflation: జూలైలో భారీగా పెరగనున్న ద్రవ్యోల్బణం.. ఇక ధరల మోతే
Also Read: WI vs IND Day 2 Highlights: రోహిత్, జైస్వాల్ సెంచరీలు.. భారీ ఆధిక్యం దిశగా భారత్!
Virat Kohli celebrating his first boundary of the innings.
What a fantastic character.pic.twitter.com/f0DLJ8No4f
— Johns. (@CricCrazyJohns) July 14, 2023
Virat Kohli's arrival in Dominica.
– Need a hundred from King Kohli! pic.twitter.com/4QG9nEdPqL
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 13, 2023