Virat Kohli Asking Anushka Sharma to Clap in IND vs NED Match: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచాడు. బ్యాట్‌తో మాత్రమే కాదు బంతితోనూ మాయ చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ (51) చేసిన విరాట్.. ఆపై మూడు ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ పడగొట్టాడు. అయితే విరాట్ బౌలింగ్ సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
నెదర్లాండ్స్ బ్యాటింగ్ సమయంలో విరాట్ కోహ్లీకి బంతిని ఇవ్వాలని స్టాండ్స్‌లో ఉన్న ఫాన్స్ గట్టిగా అరిచారు. ఫాన్స్ అరుపులతో స్టేడియం మొత్తం మోత మోగింది. దీంతో ఫ్యాన్స్ కోరిక తీర్చేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ.. కోహ్లీ చేతికి బంతిని ఇచ్చాడు. 23వ ఓవర్ వేసిన విరాట్ 7 పరుగులు ఇచ్చాడు. ఓవర్ ముగిసిన అనంతరం కోహ్లీ స్టాండ్స్‌లో అతడి భార్య అనుష్క శర్మను చూస్తూ.. ‘నేను బౌలింగ్ చేశా, కనీసం చప్పట్లు కూడా కొట్టవా?. ఏంటి అనుష్క ఇది’ అని సైగలు చేశాడు. అందుకు అనుష్క ఓ చిరునవ్వు చిందించారు.
Also Read: Anushka Sharma: వికెట్ తీసిన విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మ రియాక్షన్ చూశారా!
ఇక 25వ ఓవర్ మూడో బంతికి నెదర్లాండ్స్ కెప్టెన్ స్టాట్ ఎడ్వర్డ్స్ (17) వికెట్ తీశాడు. వికెట్ తీసిన అనంతరం విరాట్ సంబరాలు ఆకాశాన్ని అంటాయి. సెంచరీ చేసినప్పుడు కూడా ఇంతలా సంతోషపడి ఉండడు. మరోవైపు విరాట్ తీయగానే స్టాండ్స్‌లో ఉన్న అతని భార్య అనుష్క శర్మ కూడా ఉబ్బితబ్బి బైపోయారు. అనుష్క సంతోషానికి కూడా అవథుల్లేకుండా పోయాయి. స్టాండ్స్‌లో లేచి నిలబడి చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Kohli asking Anushka to clap 😭😭#ViratKohli #anushkasharma #INDvNED #RohitSharma pic.twitter.com/rhvh5No8mc
— Md Nayab45🇮🇳 (@MdNayab450) November 12, 2023