IND vs AUS: టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా పెర్త్ లో ఉన్న అక్టోపస్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది. మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆల్ అవుట్ అయిన టీమ్ ఇండియా.. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 104 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. దానితో స్వల్ప లీడ్ తో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా ఓపెనర్లు కేల్ రాహుల్, యశస్వి జైస్వాల్ లు ఎంతో ఓపికగా ఆడి మొదటి వికెట్ కు 201 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో టీమిండియా భారీ లీడింగ్ లోకి దూసుకు వెళ్ళింది.
Also Read: Space Out Competition: 90 నిమిషాలపాటు ‘ఏమి చేయవద్దు’.. బహుమతి గెలుచుకోండి
ఈ నేపథ్యంలో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ను 487 పరుగుల వద్ద ఆరు వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా ముందర భారీ లక్ష్యాన్ని టీమిండియా ఉంచింది. ఆస్ట్రేలియా ఈ టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే 533 పరుగులు చేయాల్సి ఉంది. ఇకపోతే రెండో ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ 161 పరుగులతో తన నాలుగో సెంచరీని పూర్తి చేసుకోగా.. విరాట్ కోహ్లీ 100 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారీ స్కోరును సాధించారు.
Also Read: IPL Mega Auction: ఐపీఎల్ వేలంలో 12 మంది ప్రత్యేకం.. పంత్ చరిత్ర సృష్టిస్తాడా?