NTV Telugu Site icon

T20 World Cup 2024: తొలి బ్యాచ్తో యూఎస్కు వెళ్లని విరాట్, హార్దిక్.. కారణం ఏంటంటే..?

Vk

Vk

T20 World Cup 2024: జూన్ 2వ తేదీ నుంచి టీ20 ప్రపంచ కప్ స్టార్ట్ కాబోతుంది. భారత్‌ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో ఆడనుంది. ఇప్పటికే టిమిండియా తొలి టీమ్ అమెరికా వెళ్లింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు యువ క్రికెటర్లు అక్కడికి వెళ్లిపోయారు. అయితే, తొలి బృందంతో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో పాటు వైస్‌ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య ఇంకా వెళ్లలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వీరి మ్యాచ్‌లు కూడా లేవు.. అయినా వీళ్లు వెళ్లకపోవడానికి విభిన్న కారణాలు వినిపిస్తున్నాయి.

Read Also: CYGNUS Gastro Hospitals: సిగ్నస్‌ గ్యాస్ట్రో హాస్పిటల్‌లో వినూత్నమైన శస్త్రచికిత్స

అయితే, ఐపీఎల్‌లో అద్భుత ఫామ్‌తో భారీగా రన్స్ సాధించిన విరాట్ కోహ్లీ ‘అమెరికా’ వెళ్లే విషయంలో ఓ ప్రాబ్లమ్ వచ్చింది.. అతడి వీసాకు సంబంధించి పేపర్ వర్క్‌ పెండింగ్‌లో ఉన్నాయని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. మే 30వ తేదీన అమెరికాకు కోహ్లీ వెళ్లనున్నాడని సమాచారం. దీంతో బంగ్లాదేశ్‌తో వార్మప్‌ మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండకపోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది. బంగ్లాతో జూన్ 1వ తేదీన టీమిండియా వార్మప్‌లో తలపడబోతుంది.

Read Also: KTR: గల్లిమే లూటో… ఢిల్లీకి భేజో అన్నట్టుగా కాంగ్రెస్ నేతల తీరు

మరోవైపు, భాతర జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు సమాచారం. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం కొనసాగుతుంది. ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ ఘోర ప్రదర్శన చేయడంతో కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్యపై అనేక విమర్శలు వచ్చాయి. తాజాగా, పాండ్యా దంపతుల విడాకుల వార్తలు కూడా రావడంతో అతడు లండన్‌ వెళ్లినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అక్కడి నుంచే నేరుగా యూఎస్‌కు ఫ్లైట్ ఎక్కి వస్తాడని సమాచారం.