NTV Telugu Site icon

Virat Kohli Pakistan: పాకిస్థాన్ టూర్‌లో స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ, హీరోయిన్‌ దీపికా పదుకొణె!

Virat Kohli Deepika Padukone

Virat Kohli Deepika Padukone

Virat Kohli Artificial Intelligence (AI) Pics in Pakistan Settings Goes Viral: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక కళాకారుడి ఊహకు ప్రాణమే ఈ ఏఐ (కృత్రిమ మేధ) చెపుప్పొచ్చు. ఏఐ సాయంతో సృష్టించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్నాయి. ఫోటోషాప్, మిడ్‌జర్నీ మరియు ప్రోక్రియేట్ వంటి రకరకాల యాప్‌లతో వారి అభిమాన సెలబ్రిటీల ఫొటోలను తయారు చేసుకుని ఫ్యాన్స్‌ తెగ ఆనందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ కళాకారులు యాప్‌లను ఉపయోగించి సృజనాత్మక పోటోలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. అలా ఓ వ్యక్తి సృష్టించిన చిత్రాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

భారత సెలబ్రిటీలు మన శత్రు దేశమైన పాకిస్థాన్‌ వెళ్లి.. అక్కడ ఫొటోలు దిగితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన ఓ వ్యక్తికి వచ్చింది. ఆ ఆలోచనకు అనుగుణంగా ఏఐను ఉపయోగించి.. మన దేశ సెలబ్రిటీలు పాక్‌లోని పలు పర్యాటక ప్రాంతాల్లో ఫొటోలు దిగినట్లు క్రియేట్‌ చేశాడు. వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. వైరల్‌గా మారాయి. ఇందులో ప్రముఖ సినీ, క్రీడాకారుల కృత్రిమ ఫొటోస్ ఉన్నాయి. ఈ ఫొటోస్ చూసి ఫాన్స్ ఆశ్చర్యంకు గురవుతున్నారు.

Also Read: Rashi Khanna Saree Pics: పట్టు చీరలో రాశి ఖన్నా.. అందానికే అసూయ కలిగేలా మెరిసిపోతుంది!

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ.. పాకిస్థాన్‌లో ఫొటోలు దిగినట్లు సృష్టించిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో కోహ్లీ సూట్ వేసుకుని కళ్లకు అద్దాలు పెట్టుకున్నాడు. విరాట్ పెషావర్ సందర్శించినట్టు ఫొటోస్ క్రియేట్ చేశారు. ఈ పోటోను పాకిస్థాన్‌ ఏఐ కళాకారుడు సబూర్ అక్రమ్ షేర్ చేశారు. కోహ్లీమీ కాదు పాక్ ప్లేయర్స్ బాబర్ ఆజం, అతిఫ్ అస్లాం మరియు మహీరా ఖాన్ కూడా ఉన్నారు. వీరందరూ పాకిస్థాన్ దేశంలోని పలు ప్రాంతాలలో పోజులివ్వడం చూడవచ్చు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌, హీరోయిన్‌ దీపికా పదుకొణె కూడా పాకిస్థాన్‌లో ఫొటోలు దిగినట్లు సృష్టించిన చిత్రాలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలకు నెట్టింట లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘విరాట్ కోహ్లీ పాకిస్తాన్ వెళ్లాడా?’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘దీపికా పదుకొణె పాకిస్థాన్‌లో ఉందా?’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఇక జైలర్‌ సినిమాలో తమన్నా చేసిన కావాలయ్యా పాటలోని హుక్‌ స్టెప్పులకు కృత్రిమ మేధను ఉపయోగించి చేసిన వీడియోలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

Also Read: Kishan Reddy: అమెరికాకు కిషన్ రెడ్డి.. రేపు హెచ్ఎల్‌పీఎఫ్‌ వేదికగా ప్రసంగం..!