Site icon NTV Telugu

Virat Kohli : విరాట్ కు అదిరిపోయే గిఫ్ట్..

Virat

Virat

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో సరికొత్త ఫీట్ ను సాధించిన తొలి భారతీయ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. కేవలం 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసిన కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో కనిపించాడు. ఇది ఐపీఎల్ లో అతని 50వ50 ప్లస్ రన్స్ తో ఆకట్టుకునే ఫీట్ ను సాధించాడు. అయితే ఈ లిస్ట్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 60తో అగ్రస్థానంలో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 49తో ఓవరాల్ లిస్ట్ లో మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ పేరు మీద 45 అర్థ సెంచరీలు.. 5 సెంచరీలు ఉన్నాయి.

Read Also : Pawan Kalyan: పోలవరం సత్వరమే పూర్తి చేయండి.. కేంద్రమే చొరవ తీసుకోవాలి..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఆదివారం మొత్తం మీద, డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. దీంతో ఆంపియర్ ఎలక్ట్రిఫైయింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన ప్రదర్శనకు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను గిఫ్ట్ గా అందుకున్నాడు. బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించిన కోహ్లీ( 82 నాటౌట్ ) గా నిలిచాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(73)తో కలిసి 148 ఓపెనింగ్ పార్టనర్ షిప్ తో శుభారంభం చేసి జట్టుకు 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. దీంతో ఆర్సీబీ-థీమ్ ఆంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను సంస్థ కోహ్లీకి అందించింది. గ్రీవ్స్ ఎలక్ట్రీక మొబిలిటీ సీఈవో, డైరెక్టర్ సంజయ్ బెహ్ల్ కొత్త లిమిటెడ్-ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైమస్ ను కోహ్లీకి అందించారు. అయితే మొత్తం మీద, డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

Read Also : Paripurnanada : హిందువులకు మాత్రమే ఆధార్ కార్డులివ్వాలి..

Exit mobile version