Site icon NTV Telugu

RCB vs DC : ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. మరో రికార్డ్ పై కన్నేసిన విరాట్ కోహ్లీ

Rcb Vs Dc

Rcb Vs Dc

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య ఇవాళ రాత్రి 7: 30 గంటలకు.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ఓ భారీ రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి 12 పరుగులు చేస్తే.. ఐపీఎల్‌ చరిత్రలో 7000 పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా ఘనత సృష్టించనున్నాడు. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో 6988 పరుగులు (232 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత శిఖర్‌ ధవన్‌ (6536), డేవిడ్‌ వార్నర్‌ (6189), రోహిత్‌ శర్మ (6063) వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచారు.

Also Read : Air India: ప్రయాణికురాలికి తేలు కాటు.. ఎయిరిండియా ఫ్లైట్‌లో ఘటన

కాగా, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో సూపర్‌ ఫామ్‌లో (9 మ్యాచ్‌ల్లో 364 పరుగులు, 5 ఫిఫ్టీలు) ఉన్న విరాట్‌ కోహ్లీకి ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్‌లోనే 7000 పరుగుల మార్కును అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. ఐపీఎల్‌-2023 50వ మ్యాచ్‌లో కోహ్లీ ఈ మైలురాయిని అందుకోగలిగితే, అతనికి ఈ మ్యాచ్‌ తన జీవితకాలం గుర్తుండిపోతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే విషయంలోనూ ఈ మ్యాచ్‌ చాలా కీలకంగా మారింది. విరాట్ కోహ్లీ సైతం ఈ మ్యాచ్‌లో శక్తి మేరకు రాణించాలని ఆశిస్తున్నాడు.

Also Read : Adimulapu Suresh: వచ్చే ఎన్నికల్లో గత తీర్పు రిపీట్.. వారిపై విశ్వాసం లేదు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ప్రస్తుతం 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో (-0.030) కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ తేడాతో గెలిస్తే ఏకంగా 3 స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి (ముంబై చేతిలో చెన్నై ఓడితే) చేరుకుంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్‌ టాప్‌లో (14 పాయింట్లు) ఉండగా.. లక్నో (11 పాయింట్లు, 0.639) రెండులో, చెన్నై సూపర్ కింగ్స్ (11 పాయింట్లు, 0.329) మూడులో, రాజస్థాన్‌ రాయల్స్ (10 పాయింట్లు, 0.448) నాలుగో స్థానంలో ఉన్నాయి.

Exit mobile version