Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports Virat Kohl In Rishikesh Ashram Ahead Of Test Series Against Australia

Virat kohli: ఆ స్వామీజీతో కోహ్లీ, అనుష్క.. ఫోటోలు వైరల్

Published Date :January 31, 2023 , 2:35 pm
By Nishanth Munjala
Virat kohli:  ఆ స్వామీజీతో కోహ్లీ, అనుష్క.. ఫోటోలు వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆధ్యాత్మిక యాత్రతో బిజీ అయ్యాడు. భార్య అనుష్క, కూతురు వామికాతో కలిసి స్వామీజీలను కలుస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నాడు. తాజాగా రిషికేష్‌లోని ఓ ఆశ్రమానికి వెళ్లాడు. రిషికేష్‌లోని స్వామి దయానంద్ గిరి ఆశ్రమంలో విరాట్ కనిపించాడు. అక్కడి బ్రహ్మాలిన్ దయానంద్ సరస్వతి సమాధిని సందర్శించాడని, ఆ తర్వాత గంగా ఘాట్‌లో గంగా హారతిలోనూ విరాట్ పాల్గొన్నాడని ఆశ్రమం పీఆర్వో గుణానంద్ రాయల్ వెల్లడించారు. రెండు రోజులుగా వీళ్లు ఆశ్రమంలోనే ఉన్నారు. కోహ్లీ, అనుష్కతో పాటు వాళ్ల యోగా ట్రైనర్ కూడా వెంట ఉన్నారు. మంగళవారం (జనవరి 31) ఉదయం ఆశ్రమంలో నిర్వహించే భండారా అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలోనూ వీరు పాల్గొన్నారు. ఈరోజు రాత్రి కూడా కోహ్లీ ఫ్యామిలీ ఆశ్రమంలోనే ఉండనుంది.

Virat Kohli with his family visit in Rishikesh.#ViratKohli𓃵 pic.twitter.com/cnPZ7UhlHE

— Mohali to Melbourne 82* (@MelbourneNT82) January 30, 2023

ఇటీవలే కోహ్లీ, అనుష్క బృందావన్‌లోని ఆశ్రమానికి కూడా వెళ్లారు. అక్కడ శ్రీ పరమానంద ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాతే శ్రీలంకతో సిరీస్ ఆడాడు. ఆ సిరీస్‌లో విరాట్ రెండు సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ చెలరేగాలని భావిస్తున్న కోహ్లీ.. ఆ కీలకమైన సిరీస్ కు ముందు రిషికేష్ ఆశ్రమానికి వెళ్లాడు. ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కోసం బుధవారం (ఫిబ్రవరి 1) ఆస్ట్రేలియా జట్టు ఇండియా రానుంది. నాగ్‌పూర్‌లో 9వ తేదీని మ్యాచ్ ప్రారంభం వరకూ బెంగళూరులోనే ఉండి ప్రాక్టీస్ చేయనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • VIRAT KOHLI
  • Virat Kohli Anushka
  • Virat Kohli at Ashramam
  • virat kohli in rishikesh ashram
  • Virat Kohli Rishikesh

తాజావార్తలు

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

  • Off The Record: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి సాయం చేయబోయి.. ఆ ముగ్గురు టీడీపీ సీనియర్స్‌ అడ్డంగా బుక్కయ్యారా?

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions