NTV Telugu Site icon

Viral Videos: ధ్రువ్ జురెల్, శుభ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్‌లు.. భలేగా పట్టారు భయ్యో!

Shubman Gill Catch

Shubman Gill Catch

Rishabh Pant Shock after Shubman Gill Takes Spectacular Catch: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024 గురువారం ఆరంభమైంది. ఇండియా-ఎ, ఇండియా-బి మధ్య బెంగళూరులో మ్యాచ్ జరుగుతుంటే.. అనంతపురంలో ఇండియా-సి, ఇండియా-డి మధ్య జరుగుతోంది. దాదాపుగా టీమిండియాలోని ప్లేయర్స్ అందరూ బరిలోకి దిగారు. కొందరు బ్యాటింగ్, మరికొందరు బౌలింగ్‌లో మెరిస్తే.. ఇంకొందరు ఫీల్డింగ్‌లో ఔరా అనిపించారు. ముఖ్యంగా యువ ప్లేయర్స్ శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్ స్టన్నింగ్ క్యాచ్‌లు పట్టారు. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇండియా-ఎ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పట్టిన క్యాచ్‌కు ఇండియా-బి కీపర్ రిషబ్ పంత్ బిత్తరపోయాడు. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో పంత్ ఫ్లిక్ షాట్ ఆడగా.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. గిల్ వెనక్కి పరుగెత్తి సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. దాంతో పంత్ నిరాశగా పెవియన్ చేరాడు. 10 బంతుల్లో 7 పరుగులే చేసి పంత్ వెనుదిరిగాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.

Also Read: Duleep Trophy 2024: హర్షిత్ రాణా.. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకుంటే మంచిది!

యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కూడా కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టాడు. ఇండియా-ఎ తరఫున ఆడుతున్న జురెల్.. అచ్చం దిగ్గజ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీలానే వికెట్ల వెనుకాల సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. దాంతో ఇండియా-బి కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ పెవిలియన్ చేరాడు. ఆవేశ్ ఖాన్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా బంతిని వేయగా..అభిమన్యు షాట్ ఆడే ప్రయత్నం చేసాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ కుడి వైపు దూసుకెళ్లింది. ఒక్కసారిగా డైవ్ చేసిన జురెల్ బంతిని ఒడిసిపట్టుకున్నాడు. ఇండియా-సి ఆటగాడు మానవ్ కూడా బౌండరీ లైన్‌ వద్ద అద్భుత రీతిలో క్యాచ్‌ను అందుకుని టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సెంచరీని అడ్డుకున్నాడు.

Show comments