NTV Telugu Site icon

Viral Video : వాట్ ఏ టాలెంట్ గురూ.. నాలికతో గీసిన అద్భుతమైన కోహ్లీ చిత్రం..

Kohli

Kohli

క్రికెటర్స్ కూడా అభిమానులు ఎక్కువగా ఉంటారు.. వాళ్లు బరిలోకి దిగితే ఇక గెలవాలని ఎంతగా కోరుకుంటారో.. అందులో భారత క్రికెటర్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. వారిలో ఒక వీరాభిమాని కోహ్లీ చిత్రాన్ని గీసాడు. అతని టాలెంట్ మెచ్చుకునేలా ఉన్నా కూడా అతను నాలికతో వెయ్యడం పై విమర్శలు అందుకున్నాడు.. అతను బొమ్మ గీసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ముఫద్దల్ వోహ్రా అనే ట్విట్టర్ యూజర్ ఓ గుర్తు తెలియని ఆర్టిస్ట్ తన నాలుక కొనలను ఉపయోగించి విరాట్ కోహ్లీ చిత్రాన్ని గీసే వీడియోను షేర్ చేసాడు. ఈ క్లిప్ వైరల్ అవుతోంది. ‘విరాట్ కోహ్లీని ఓ అభిమాని తన నాలుకతో కళాత్మకంగా తీర్చిదిద్దాడు’ అనే శీర్షికతో పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లు ఆ విచిత్రమైన పెయింట్ రుచి గురించి అడిగారు. కొందరు అతని టాలెంట్‌ను మెచ్చుకుంటే మరికొందరు పెదవి విరిచారు.. అభిమానం ఉంటే ఇలా చేస్తారా.. అని రకరకాల కామెంట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి ‘ప్రతిభావంతుడైన వ్యక్తి’ అని.. ‘పెయింటింగ్ పెర్ఫెక్ట్‌గా కనిపిస్తున్నా అతను వేసిన విధానం సరిగా లేదని’ ట్విట్టర్‌లో చాలామంది కామెంట్లు పెట్టారు.. గతంలో చాలా మంది కోహ్లీ పై అభిమానాన్ని చాటుకున్నారు.. అందుకు సంబందించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.. మొత్తానికి తన టాలెంట్ విమర్శల, ప్రశంసల నడుమ ప్రపంచానికి చూపించాడు.. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ఆ వీడియో పై ఓ లుక్ వేసుకోండి..

Show comments